యాక్షన్ కొరియోగ్రాఫర్స్ గురించి ఓ మోస్తరుగా తెలిసిన వాళ్లకైనా, పీటర్ హెయిన్ అనే పేరు గురించి తెలియకుండా ఉండదు. అంతలా ఆయన తన యాక్షన్‌తో మెప్పించారు. 'మగధీర'లో యుద్ధ సన్నివేశాలు కంపోజ్ చేయాలన్నా, 'రేసుగుర్రం' వంటి సినిమాల్లో స్టైలిష్ అండ్ యాక్షన్ ఘట్టాలు రూపొందించాలన్నా ఆయనకు ఆయనే సాటి. ప్రత్యర్థిని కత్తితో కచ కచా పొడిపించే సీన్స్‌లో హీరోయిజాన్ని పీటర్ హెయిన్ తనదైన స్టైల్‌లో చూపించారు ఆయా చిత్రాల్లో. రిస్కీ షాట్స్ చేయడంలో, చేయించడంలోనూ ఆయన ముందుంటాడు. 'మగధీర' టైంలో ఓ భారీ యాక్షన్ సీన్‌లో గాయపడి చాలా రోజులు యాక్షన్‌కి దూరమయ్యారాయన. మృత్యు అంచుల దాకా వెళ్లి, అదృష్టం కొద్దీ కోలుకుని మళ్లీ మన ముందుకు వచ్చారు.
సౌత్‌తో పాటు, బాలీవుడ్‌లోనూ మంచి పేరు దక్కించుకున్న పీటర్, ఇక యాక్షన్‌కి కట్ అంటున్నారు. డైరెక్షన్ షురూ చేయనున్నారు. 'రేసుగుర్రం', 'లక్ష్మీ', ముకుందా' తదితర సక్సెస్ ఫుల్ చిత్రాలను రూపొందించిన ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి నిర్మాణంలో పీటర్ హెయిన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దసరాకి ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించనున్నారట. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్స్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా, లారెన్స్ దర్శకులుగానూ సత్తా చాటుతున్నారు. గుహన్ వంటి యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఇప్పటికే డైరెక్టర్స్‌గా ప్రూవ్ చేసుకున్నారు. ఇక పీటర్ హెయిన్స్ వంతొచ్చింది. ఈయన కూడా డైరెక్టర్‌గా సక్సెస్ కావాలని ఆశిద్దాం. పీటర్ సినిమాలోని నటీనటులు, ఇతర టెక్నీషియన్ల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
|