Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
oka melakuva book review

ఈ సంచికలో >> శీర్షికలు >>

సరైన భంగిమ ప్రాముఖ్యత - ..

The importance of proper posture

అవయవ సౌకర్యం అనేది ఒకటి ఉంటుంది. దీనికి చాలా అంశాలు ఉంటాయి. అందులోని ఒక అంశాన్ని ఇప్పుడు చూద్దాం. శరీరంలోని ముఖ్య అవయవాలు మన ఛాతి, ఉదర భాగాల్లోనే ఉన్నాయి. అవి గట్టిగా నట్లు బోల్టులతో కట్టి లేవు. అవి వదులుగా, వలలోలాగా వేలాడుతూ ఉన్నాయి. మీరు మీ వెన్నెముక నిటారుగా ఉంచుకుని కూర్చుంటేనే మీ అవయవాలు ఎక్కువ సౌకర్యంగా ఉంటాయి.  వాలిపోయిన సీటులో మీరు ఒక 1000 కిలోమీటర్లు ప్రయాణిస్తే, మీ జీవితకాలం కనీసం 3 నుండి 5 సంవత్సరాలకి తగ్గిపోతుంది.

ఈ రోజుల్లో హాయి అంటే, వెనక్కి జారబడి వాలిపోవటం. మీరు అలా వెనక్కి వాలి కూర్చుంటే, మీ అవయవాలు ఎప్పటికీ సౌకర్యంగా ఉండవు. వాటి పనిని అవి సక్రమంగా నిర్వహించలేవు. ముఖ్యంగా, మీరు కడుపు నిండా తిని వాలుకుర్చీలో కూర్చున్నప్పుడు ఇది వర్తిస్తుంది. చాలా ప్రయాణాలు వాలుగా ఉన్న సీట్లలో జరుగుతుంటాయి. మీరు కారులో, వాలు కుర్చీలో కూర్చుని 1000 కిలోమీటర్లు ప్రయాణిస్తే, మీ జీవితకాలం కనీసం 3 నుండి 5 సంవత్సరాలు తగ్గిపోతుంది. దీనికి కారణం, మీ అవయవాలు తీవ్ర ఇబ్బందికి గురై వాటి సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతుంది లేదా మీరు కనీసం కొన్ని రకాలుగా బలహీనపడతారు.

శరీరాన్ని నిటారుగా ఉంచడం అంటే, మనకి సౌకర్యం అంటే ఇష్టం లేక కాదు, సౌకర్యాన్ని పూర్తిగా వేరేవిధంగా అర్థం చేసుకోవడం వల్ల. మీ వెన్నెముక ను నిటారుగా ఉంచి మీ కండరాలకు సౌకర్యంగా ఉండే శిక్షణ ఇవ్వవచ్చు, అంతేకాని వంగి కూర్చుని మీ అవయవాలకు సౌకర్యంగా ఉండే శిక్షణ ఇవ్వలేరు. అలా చేసే మార్గం లేదు. ఈ విధంగా(నిటారుగా) కూర్చొని కూడా, మన అస్థిపంజర వ్యవస్థ మరియు కండరాల వ్యవస్థ సౌకర్యంగా ఉండే విధంగా, మేము శారీరక శిక్షణ ఇవ్వడానికే ఎంచుకున్నాం.

మరిన్ని శీర్షికలు
lemon chicken