Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
veerabhadram to be direct jr ntr

ఈ సంచికలో >> సినిమా >>

రుద్రమదేవిలో నథాలియా అదరహో

nathalia kaur

నథాలియా.. ఇంతందాన్ని ఇంకెక్కడా చూడలేదని సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మైమర్చిపోయిన ఆ అందం, తెలుగు తెరపై కన్పించబోతోంది. అది కూడా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న ‘రుద్రమదేవి’ సినిమాలో కావడం విశేషమిక్కడ. చాలా గ్లామరస్‌గా నథాలియా పాత్ర వుంటుందట‘రుద్రమదేవి’ సినిమాలో.


అందమొక్కటే కాదు, గుణశేఖర్‌ సినిమాలో ప్రతి పాత్రా నటనను పండించ్చారనాల్సిందే. నథాలియాకి కూడా మంచి నటనకు ప్రాధాన్యమున్న పాత్ర ఇచ్చాడట అతడు. నథాలియా అందానికి ఆమె హైట్‌ అదనపు ఆకర్షణ. దాదాపుగా ఐదడుగుల పది అంగుళాల హైట్‌ వుంటుందట ఆమె.


విశేషమేంటంటే, ‘రుద్రమదేవి’ సినిమాలో అందరూ పొడగరులే. హీరో రాణా గురించి తెలుసు కదా, సిక్స్‌ ఫీట్‌ ప్లస్‌ హైట్‌ అతను. దానికి తోడు సిక్స్‌ ప్యాక్‌. టైటిల్‌ రోల్‌లో కన్పించనున్న అనుష్క కూడా చాలా పొడగరి. నథాలియాని కూడా ఆమె పొడవును, ఆమె గ్లామర్‌ని చూసే గుణశేఖర్‌ ఎంపిక చేసుకున్నాడేమో.


ఇంతకీ, గుణశేఖర్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘రుద్రమదేవి’ సినిమాలో నథాలియా పాత్ర ఏంటి? జస్ట్‌ వెయిట్‌.. కొన్ని రోజులు ఆగితే అన్ని విషయాలూ తెలుస్తాయి.

మరిన్ని సినిమా కబుర్లు
Raana as Hero and Villain