Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movie Review - Oka Laila Kosam

ఈ సంచికలో >> సినిమా >>

Happy Deepavali

అలాంట‌ప్పుడు పారితోషికం త‌గ్గించుకొంటా - నాగ‌చైత‌న్య‌

interview with naga chaitanya

జోష్‌తో తొలి అడుగులోనే త‌డ‌బ‌డ్డాడు నాగ‌చైత‌న్య‌. అయితే కోలుకోవ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం తీసుకోలేదు. త‌న‌కేం క‌థ‌లు న‌ప్పుతాయో తొంద‌ర‌గానే అర్థం చేసుకోగ‌లిగాడు. ఏం మాయ చేశావె తో కాస్త ట్రాక్ ఎక్కిన చైతూ... 100%ల‌వ్‌తో రొమాంటిక్ క‌థానాయ‌కుడిగా నిల‌బ‌డిపోయాడు. మ‌ధ్య‌లో చేసిన యాక్ష‌న్ ప్ర‌య‌త్నాలు బెడ‌సి కొట్టాయి. చైతూలో ఇంకా కుర్ర ల‌క్ష‌ణాలే క‌నిపిస్తుండ‌డంతో యాక్ష‌న్ క‌థ‌ల్లో అత‌న్ని చూడ‌లేక‌పోయాం. బెజ‌వాడ‌, ద‌డ‌, ఆటోన‌గ‌ర్ సూర్య‌.. ఇవ‌న్నీ బాక్సాఫీసు ద‌గ్గ‌ర త‌ల‌కిందుల‌య్యాయి. మ‌ళ్లీ... త‌న దారిలోనే వెళ్లి మ‌నంలో న‌టించాడు. అటు తాత‌య్య‌, ఇటు నాన్న‌ల‌మ‌ధ్య నిల‌బ‌డ‌గ‌లిగాడు. మ‌రోసారి ఒక‌లైలా కోసం అంటూ త‌న‌కు అచ్చొచ్చిన ల‌వ్‌స్టోరీ బాట‌లోనే న‌డ‌వ‌బోతున్నాడు చైతూ. ఈ సినిమా ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సంద‌ర్భంగా చైతూతో జ‌రిపిన సంభాష‌ణ‌.

* ఒక లైలా కోసం... అంటూ మ‌ళ్లీ ల‌వ్ స్టోరీల్లోకి దిగిపోయారు.. మేట‌రేంటి?
- నాకెరీర్ ప్రారంభ‌మైంది ల‌వ్ స్టోరీల‌తోనే క‌దా. నాకూ అవే బాగా సూట‌య్యాయి మ‌రి.

* ఫ్యాన్స్ కూడా ఇదే అంటున్నారా?
- అఫ్ కోర్స్‌... మీరు మ‌రిన్ని ల‌వ్‌స్టోరీలు చేయాలి అని అడుగుతుంటారు. నా డైరెక్ట‌ర్స్ కూడా అలాంటి క‌థ‌ల‌తోనే వ‌స్తున్నారు.

* మ‌రి మ‌ధ్య‌లో యాక్ష‌న్ డ్రామాలు న‌డిపారు..
- అదా.. ఫ‌ర్ ఏ ఛేంజ్ అనుకోవాలి. నా ఏజ్‌కి ల‌వ్‌స్టోరీలు న‌ప్పుతాయి. అలాగ‌ని అస్త‌మానూ అవే చేయలేను క‌దా. అందుకే అప్పుడ‌ప్పుడూ యాక్ష‌న్ ద‌ట్టిస్తుంటా.

* ఓ లైలా కోసం న‌టిస్తుంటే... మీ లైలా గుర్తొచ్చిందా?
- భ‌లేవారే. అలాంటిదేం లేదు. అదీ ఇదీ అడిగి నా ల‌వ్‌స్టోరీని బ‌య‌ట‌పెట్టేద్దామ‌నుకొంటున్నారా..??

* ఒక్క మాట‌లో లైలా గురించి చెప్పాలంటే
- ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ. తాను ప్రేమించిన అమ్మాయి కోసం కార్తీక్ అనే అబ్బాయి ఎంత విలువైన బ‌హుమ‌తి ఇచ్చాడ‌న్న‌ది స్టోరీ.

* కార్తీక్‌.. అంటే ఏం మాయ చేశావె సెంటిమెంటా..?
- అదేం లేదండీ. విజ‌య్ కుమార్ కొండా డిసైడ్ చేసిన పేర‌ది. గుండెజారి గ‌ల్లంత‌య్యిందే హీరో పేరు కూడా కార్తీకే. మా ఇద్ద‌రికీ కార్తిక్ క‌లిసొచ్చింది.

* హైలైట్స్ ఏంటి?
- క‌థ బాగుంది. దానికి త‌గ్గ‌ట్టు నా క్యారెక్ట‌రైజేష‌న్ బాగా కుదిరింది. ఇంట్ర‌వెల్ బ్యాంగ్‌, క్లైమాక్స్ త‌ప్ప‌కుండా న‌చ్చుతాయి.

* మ‌నం త‌ర‌వాత మీ సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగాయి...
- అభిమానుల మాట అటుంచితే ముందు నాకు నా బాధ్య‌త తెలిసొచ్చింది. ఇక ముందు కూడా జాగ్ర‌త్త‌గా స్ర్కిప్టు ఎంచుకోవాలి, ఇంకా మంచి సినిమాలు చేయాలి... అనే జాగ్ర‌త్త అది. నా నుంచి ఏం కోరుకొంటున్నారో మ‌నంతో తెలిసొచ్చింది.

* మ‌ధ్య‌లో ఆటోన‌గ‌ర్ సూర్య బాగా నిరుత్సాహ‌ప‌రిచాడా?
- ఆ సినిమాకి టైమ్ బాలేదు. ఎప్పుడో రావ‌ల్సింది. లేట్‌గా వ‌చ్చింది. రిజ‌ల్ట్ కూడా అలానే త‌యారైంది. నిజానికి అనుకొన్న టైమ్‌కి విడుద‌ల అయితే.. అంత డామేజ్ జ‌రిగేది కాదు.

* ఈ సినిమా విష‌యంలో నాన్న‌గారి ప్ర‌మేయం చాలా ఉంద‌ట‌
- చాలా కాదండీ. కొంత‌వ‌ర‌కూ ఉంది. క‌థ విష‌యంలో ఆయ‌న జ‌డ్జిమెంట్ తీసుకొంటా. క‌థ వినేట‌ప్పుడు ఆయ‌న నాతోపాటు ఉండ‌రు. నాకు న‌చ్చితే డాడీని కూడా ఓసారి విన‌మంటా. ఒక‌వేళ ఆయ‌న‌కు న‌చ్చ‌క‌పోయినా స‌రే.. `నీకు న‌చ్చితే చేయ్‌.. ముందు నీకు క‌థ‌పై న‌మ్మ‌కం ఉండాలి` అని చెప్తుంటారు. ఒక‌లైలా కోసం క‌థ ఆయ‌న‌కు వినిపించా. బాగుంద‌న్నారు. మేం.. క్యారీ చేశాం.

* డాడీ చెప్పిన మార్పుల వ‌ల్లే రీషూట్ చేశార‌ని అంటున్నారు..
- అదెంతండీ.. 2,3 రోజులంతే. సినిమా అంతా పూర్త‌య్యాక ఎవ‌రికైనా చూపిద్దాం అనుకొన్నాం. ఎందుకంటే ఆ సినిమాలోనే ఉన్నాం కాబ‌ట్టి, మా త‌ప్పులు మాకు తెలీవు. బ‌య‌ట వ్య‌క్తి చూస్తే త‌ప్పులు క‌నిపెడ‌తారు. అలా నాన్న‌కి చూపిస్తే రెండు మూడు క‌రెక్ష‌న్స్ చెప్పారు. దాంతో కొన్ని సీన్స్ రీషూట్ చేశామంతే.

* తొలి సినిమా నుంచీ ఇప్ప‌టి వ‌ర‌కూ వెన‌క్కి తిరిగి చూసుకొంటే..  మీ బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు అర్థ‌మ‌య్యాయా?
- ఎన్ని సినిమాలు ఎవ‌రూ పరిపూర్ఱులు కారండీ. మిస్టేక్స్ ఉంటాయి. అయితే వాటి శాతం త‌గ్గించుకొంటూ రావాలి. చైతూ కామెడీ చేయ‌గ‌ల‌డా?  అనుకొన్నారంతా. కానీ మ‌నంతో స‌మాధానం దొరికింది. డాన్స్‌ల విష‌యంలో కాస్త దృష్టి పెట్టాలి. ఒక లైలా కోసంలో నా డాన్సులు కొత్త‌గా ఉంటాయి. ఇట్స్ మై ప్రామిస్‌.

* ఒక లైలా కోసం ప్రొడ‌క్ష‌న్ కూడా చూసుకొన్నారు. నిర్మాత‌గా అనుభ‌వం వ‌చ్చిందా?
- చిన్న చిన్న పాఠాలు నేర్చుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డిందంతే. సినిమా అనేది టీమ్ వ‌ర్క్‌. ఎన్ని ప్ర‌ణాళిక‌లు వేసుకొన్నా సెట్లో ఏం చేస్తున్నాం, ఏం చేశామ‌న్న‌దే ఫైన‌ల్‌.

* ఓ సినిమా బ‌డ్జెట్ విష‌యంలో మీ ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయి?
- ఈ సినిమా ఎంత ఖ‌ర్చు పెడుతున్నారు అనే విష‌యం ముందుగానే నేను నిర్మాత‌ల్ని అడుగుతా. నా బ్యాన‌ర్ అయినా, కాక‌పోయినా బ‌డ్జెట్ విష‌యంలో నిక్క‌చ్చిగా ఉండాల్సిందే. ఎందుకంటే సినిమా అంటే ప్రొడ్యూస‌ర్‌, హీరో మాత్ర‌మే కాదు. వేలాది కుటుంబాలు బ‌తుకుతున్నాయి. వాళ్ల‌నీ దృష్టిలో పెట్టుకోవాలి.

* సినిమా ఫెయిలైతే పారితోషికాలు వెన‌క్కి ఇస్తున్నారు హీరోలు. మీరేమంటారు?
- అది మంచి ప‌ద్ధ‌తే. అయితే అంద‌రూ కూర్చుని మాట్లాడుకోవాలి. లాభాన్నే కాదు. న‌ష్టాల్నీ భ‌రించ‌డానికి అంద‌రూ ముందుకు రావాలి.

* మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ న‌డుస్తోంది. మ‌రి మీరెప్పుడు భాగం పంచుకొంటారు?
- ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నా. క‌థ కుదిరితే చేయ‌డానికి నేను సిద్ధ‌మే. మ‌ల్టీస్టార‌ర్ సినిమాలొస్తే... ప‌రిశ్ర‌మ మ‌రింత క‌ళ‌క‌ళ‌లాడుతుంది. బ‌డ్జెట్ పెరిగిపోతుంద‌న్న బెంగ ఉండ‌దు. ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంటుంది. మంచి క‌థ‌లొస్తే.. నా పారితోషికం త‌గ్గించుకొని మ‌రీ న‌టిస్తా.

* సుధీర్ వ‌ర్మ‌తో సినిమా చేస్తున్నారు. అదెలా ఉండ‌బోతోంది?
- స్వామి రారాలానే క్రైమ్‌, కామెడీ జోన‌ర్‌లో సాగే సినిమా. నాకో కొత్త ప్ర‌య‌త్నం.

* త‌రువాతి సినిమాలేంటి?
-కొత్త క‌థ‌లు వింటున్నా. అన్నీ ఖ‌రార‌య్యాక త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తా.

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka