Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
stars moved for

ఈ సంచికలో >> సినిమా >>

Happy Deepavali

గ్లామర్‌కి తొందరేముంది?

no rush forglamour

నటిగా ప్రూవ్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తోన్నదట కొత్త బ్యూటీ సనా మక్బూల్‌. కొడుకుతోనూ, తండ్రితోనూ ఒకేసారి లవ్‌లో పడటం అనే కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రంలో తండ్రి, కొడుకుల్ని తన వలలో పడేసే హీరోయిన్‌గా నటించిన సనా మక్బూల్‌, గ్లామరస్‌ పాత్రలు కూడా చేయడానికి సిద్ధమేనని చెప్పింది. అయితే గ్లామరస్‌గా కనిపించడానికి ఇంకా టైముందని వెల్లడించిందామె.తెలుగు సినీ పరిశ్రమలో బికినీ ట్రెండ్‌ తక్కువే కాబట్టి, ఆ టెన్షన్‌ ఇప్పుడే తనకు లేదని భావిస్తున్నట్లు సనా మక్బూల్‌ అంటోంది.

నటన అన్నాక గ్లామరస్‌గా కూడా కనిపించాలి కాబట్టి, ముందు ముందు గ్లామర్‌ వెదజల్లే పాత్రల్లోనూ నటిస్తానని అంటోన్న సనా మక్బూల్‌, తొలి సినిమా ఇచ్చిన విజయంతో చాలా హ్యాపీగా వుందట.ఇప్పుడు తనకు తెలుగులో అవకాశాలు బాగా వస్తున్నాయని, అదంతా ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమా సక్సెస్‌తోనే సాధ్యమైందని, తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించే పాత్రల్లో నటిస్తానని అంటూ, తనకు హీరోయిన్‌గా మంచి సక్సెస్‌ ఇచ్చిన సినీ ప్రేక్షకులకు థ్యాంక్స్‌ చెప్పింది.  గ్లామర్‌కి తొందర లేదని సనా మక్బూల్‌ చెబుతున్నప్పటికీ, నెక్స్‌ట్‌ ఆమె నటించే సినిమాల్లో ఆమెను గ్లామరస్‌గా చూపించాలని దర్శక నిర్మాతలు భావిస్తే, ఆమె కూడా తొందరపడక తప్పదు.

మరిన్ని సినిమా కబుర్లు
srutihasan good decision