Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

‘భాస్కర్‌ ది రాస్కెల్‌’ రీమేక్‌లో వెంకటేష్‌

Venkatesh  in

మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘భాస్కర్‌ ది రాస్కెల్‌’ సినిమాని తెలుగులో రీమేక్‌ చేయాలనుకుంటున్నాడట ‘విక్టరీ’ వెంకటేష్‌. ఇటీవల వెంకటేష్‌ నటించగా వచ్చి విజయాలు సాధించిన ‘దృశ్యం’, ‘గోపాల గోపాల’ రీమేక్‌ చిత్రాలే. ఆ రెండూ ఘనవిజయం సాధించడంతో హ్యాట్రిక్‌ కొట్టాలనే కసితో ఉన్న వెంకటేష్‌, ‘భాస్కర్‌ ది రాస్కెల్‌’ సినిమా చేస్తే హ్యాట్రిక్‌ నమోదవుతుందని నమ్ముతున్నాడట. వెంకటేష్‌ సోదరుడు, సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ అధినేత సురేష్‌బాబు ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్‌ చేయనున్నారనీ, ఇప్పటికే హక్కులు తీసుకున్నారనీ తెలుస్తుంది.

మలయాళంలో మమ్ముట్టి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది ‘భాస్కర్‌ ది రాస్కెల్‌’ సినిమాలో. తెలుగులో కూడా నయనతారే నటించనుందట. వెంకటేష్‌, నయనతార జంటగా ‘లక్ష్మి’, ‘తులసి’ చిత్రాలొచ్చాయి తెలుగులో. ఆ రెండు చిత్రాలూ మంచి విజయాన్ని సాధించాయి. రీమేక్‌ సెంటిమెంటే కాకుండా, నయనతార సెంటిమెంట్‌ కూడా వెంకటేష్‌కి ‘భాస్కర్‌ ది రాస్కెల్‌’ ద్వారా కలిసి రావొచ్చంటున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
get ready for movie mela