Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
but ok, samanta had big break

ఈ సంచికలో >> సినిమా >>

తన జీవిత కథలో నటిస్తానంటున్న హాట్‌ ఆంటీ

hot aunty going to play role in her biography

‘వీడే’ సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ చేసిన సోనా తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తుండి ఉంటుంది. ‘ఆయుధం’, ‘విలన్‌’, ‘ఆంధ్రావాలా’ తదితర సినిమాల్లో సోనా నటించింది. ఆ తర్వాత తమిళ సినిమాలపైనే ఫోకస్‌ ఉంచి, తమిళనాడులోనే సెటిలైపోయింది సోనా. ఎక్కువగా హాట్‌ ఆంటీ పాల్రే పోషించిన సోనా నిర్మాతగా కూడా మారింది. ‘కనిమొజి’ అనే సినిమాని సోనా నిర్మించింది.

జై, షాజాన్‌ పదామ్సీ ఇందులో హీరో హీరోయిన్లు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాల్ని చూశానంటున్న సోనా, తన జీవిత కథను ఎవరైనా సినిమాగా తీయాలనుకుంటే అందులో నటిస్తానని చెప్పింది. తాను మాత్రం తన జీవిత కథను సినిమాగా నిర్మించనని చెబుతుందీ హాట్‌ ఆంటీ. సినీ రంగంలోనే కాకుండా యూనిక్‌ అనే స్టోర్‌ని తెరిచి, వ్యాపార రంగంలోనూ ప్రవేశించింది. వివాదాలు తాను కొనితెచ్చుకున్నవి కాదనీ, తనను కొందరు వివాదాల్లోకి లాగారని చెప్తోన్న సోనా, సినీ రంగంలో అందరితోనూ సఖ్యత ఉందనీ, ఎవరితోనూ 15 ఏళ్ళలో ఎలాంటి విభేదాలు లేకుండా ఉన్నానని వివరించింది.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondichooddam