Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nobady says no for kamalini

ఈ సంచికలో >> సినిమా >>

ఓకే అయితే సమంతకి బిగ్‌ బ్రేక్‌

but ok, samanta had big break

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, దర్శకత్వంలోనూ సత్తా చాటుకుంటూ తెలుగు సినీ రంగంలో టాప్‌ దర్శకుడిగా రాణిస్తున్నాడు. సమంతతో ‘అత్తారింటికి దారేది’, ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’ చిత్రాల్ని తెరకెక్కించిన ఈ దర్శకుడు, హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీని ప్లాన్‌ చేస్తున్నాడట. ఇందులో కూడా సమంత హీరోయిన్‌గా నటించే అవకాశముందంటున్నారు.

ఆల్రెడీ సమంత ‘ఈగ’ సినిమా చేసేసింది. ఇందులో హీరో నాని ఎంతోసేపు తెరపై కన్పించడం. ఎక్కువ సమయం కనిపించేది ఈగ మాత్రమే. మిగతా సమయంలో విలన్‌ సుదీప్‌, హీరోయిన్‌ సమంతనే కన్పిస్తారు. సమంత అద్భుతమైన నటనను కనబరిచింది ‘ఈగ’ సినిమాలో. అది చూశాకే త్రివిక్రమ్‌, సమంతతో హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీ చేయాలని కృత నిశ్చయానికి వచ్చాడట. అన్నీ అనుకూలిస్తే అతి త్వరలో ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందని సమాచారమ్‌. ఈ ఊహాగానాలు నిజమే అయితే గనుక సమంతకి బిగ్‌ బ్రేక్‌ దొరికినట్లే.

మరిన్ని సినిమా కబుర్లు
hot aunty going to play role in her biography