Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Venkatesh  in

ఈ సంచికలో >> సినిమా >>

సినిమాల జాతరకు రెడీ అయిపోవచ్చు

get ready for movie mela

ఒకదాని వెంబడి ఇంకో భారీ సినిమా రానుంది. ఈ నెలాఖరులో ‘రుద్రమదేవి’ సినిమా విడుదల కానుండగా, జులైలో ‘బాహుబలి’ తెలుగు ప్రేక్షకుల్ని అలరించనుంది. ఈ రెండు సినిమాల కోసం తెలుగు సినీ  ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆగస్ట్‌లో మహేష్‌ ‘శ్రీమంతుడు’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తాడు. జులైలోనే ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నా, కొన్ని కారణాలతో ఆగస్ట్‌ 7కి రిలీజ్‌ డేట్‌ ఫైనల్‌ అయ్యింది. ‘బాహుబలి’ జులై 10న విడుదలవుతుంది.

ఆగస్ట్‌ తర్వాత సెప్టెంబర్‌లో కూడా కొన్ని భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అక్టోబర్‌ ఎలాగూ పెద్ద సినిమాలతో నిండిపోతుందనుకోండి. అది వేరే సంగతి. సమ్మర్‌లో ఒకదానికి పోటీగా ఇంకో సినిమా రావడం చూశాం. అయితే టెక్నికల్‌ కారణాలతో సమ్మర్‌ సీజన్‌ని తెలుగు సినీ పరిశ్రమ క్యాష్‌ చేసుకోలేకపోయింది. రానున్న రోజుల్లో సమ్మర్‌ని తలపించేలా పెద్ద సినిమాల మధ్య పోటీ ఉండనుంది. మధ్యలో చిన్న సినిమాల జాతర కూడా ఉంటుంది.

మరిన్ని సినిమా కబుర్లు
nobady says no for kamalini