Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
The third film in the three heroines

ఈ సంచికలో >> సినిమా >>

సినీ నిర్మాణంలో అనుష్క బిజీ బిజీ

anushka busy with movie production

బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ సినీ నిర్మాణంలో బిజీ బిజీగా మారనుంది. 'ఎన్‌హెచ్‌ 10' అనే సినిమాకి సహ నిర్మాతగా నటించిన అనుష్క శర్మ, ఈసారి తానే పూర్తిస్తాయి నిర్మాతగా 'ఎన్‌హెచ్‌ 10' దర్శకుడితోనే ఓ సినిమా నిర్మించనుంది. సినిమా పేరు 'కెనడా'. అండర్‌ వరల్డ్‌ మాఫియా, గ్యాంగ్‌స్టర్స్‌ ఇలా సినిమా అంతా డార్క్‌గా ఉంటుందట. 'ఎన్‌హెచ్‌ 10' సినిమా చేస్తున్నప్పుడే ఆ చిత్ర దర్శకుడి టేకింగ్‌పై ఇష్టం పెంచుకున్న అనుష్క, ఆ సినిమా టైమ్‌లోనే ఇంకో సినిమా చేద్దాం అని హామీ ఇచ్చి, ఆ హామీని నిలబెట్టుకునే పనిలో ఉందిప్పుడు. సినిమా నిర్మాణం అంటే కత్తి మీద సాము అని అనుష్క శర్మకీ తెలుసట. భారీ బడ్జెట్‌ సినిమాల జోలికి వెళ్ళకుండా కంట్రోల్డ్‌ బడ్జెట్‌లో సినిమాలు తీస్తే మంచి విజయం సాధించడంతోపాటు, ప్రేక్షకులకూ చక్కని కథలు, డిఫరెంట్‌ జోనర్‌ సినిమాలు అందివ్వొచ్చనే ఆలోచనతోనే అనుష్క ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాల వైపు అడుగులు వేస్తోంది. హీరోయిన్‌గా క్షణం తీరిక లేకపోయినప్పటికీ, సినిమా నిర్మాణం పట్ల ఆసక్తి చూపుతున్న అనుష్క శర్మ గట్స్‌కి హేట్సాఫ్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
tention as hero & producer