Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cheppukondichooddam

ఈ సంచికలో >> సినిమా >>

బాహుబలి హిట్ వెనుక ఆ "5 పాత్రలు!"

బాహుబలి హిట్ వెనుక ఆ

పట్టు వదలని విక్రమార్కుడు ఎప్పటిలాగే అర్ధరాత్రి ఒక్కడే స్మశానం మధ్యకు నడుస్తున్నాడు. మధ్యలో ఉన్న మర్రి చెట్టుకు వేలాడుతున్న శవాన్ని తన కత్తితో ఖండించి భుజాన వేసుకుని మౌనంగా నడుస్తూ వెళుతున్నాడు.శవం లో బేతాళుడు విక్రమార్కుడుతో ,”రాజా విక్రమార్క నీ పట్టుదల, శ్రమ చూస్తుంటే ముచ్చటేస్తుంది. పట్టుదలతో కష్ట పడే వారికి విజయం తప్పక సొంతం అవుతుంది. కానీ కొంచం సమయం పట్టచ్చు ఏమో కానీ, శ్రమ ఎప్పుడూ జయిస్తుంది.నీలానే శ్రమ పడే జనాలు అంటే నాకు చాలా ఇష్టం. ఫిలిం నగర్ పక్కనే ఉంటున్నా కనుక ఈ మధ్య సినిమా కబుర్లు బాగానే తెలుస్తున్నాయి. నిన్నో మొన్నో ఓ భారీ భారతీయ సినిమా విడుదల అయ్యింది. ఆ సినిమా నేను బ్రతికుండే రోజుల్లో ప్రారంభించారని మొన్నీ మధ్యే తెలుసుకుని ఆశ్ఛర్యపోయా. మూడు సంవత్సరాలుగా తీసేటంతగా ఏమి ఉందా అని ఆలోంచించా. పగలు అస్సలు నిద్ర పట్టలేదు. వెంటనే మొన్న శుక్రవారం మా వాళ్ళు అంతా పడుకునప్పుడు ఒక్కడినే వెళ్లి ప్రొజెక్టర్ మీద కూర్చుని 9 గంటల ఆట చూసాను. ఎవరో రాజమౌళి అట. సినిమా చాలా కష్ట పడి తీసాడు. చాలా పెద్ద హిట్ అయ్యింది కూడా.

నీకు శ్రమ తెలీకుండా ఆ సినిమా సినిమా హిట్ అవడానికి కారణాలు చెపుతాను విను,”మాహిహ్మతి సామ్రాజ్యం. ఆ రాజ్యం లో ఇద్దరు అన్నాదమ్ములు. వాళ్ళ కధే ఈ సినిమా. కధ పెద్దగా ఉందా లేదా అనే అంశం పక్కన పెడితే , తెలుగు సినిమాల్లో కధలు వెతికే బేతాళుడు ఉండడని జగమెరిగిన సత్యం. మరి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి తెర వెనుక రాజమౌళి అండ్ కో కారణం అయితే , తేరా మీద మాత్రం ఈ ఐదుగురు సినిమా కి ఊపిరి నిలిపిన పంచ భూతాలు”.

శివగామి :-

r4

నేను బ్రతికుండే రోజుల్లో వచ్చిన “రజనీ” నరసింహా లో రమ్య కృష్ణ ను చూసి ఇటువంటి పాత్ర మళ్ళీ తనకు రాదు అనుకున్నా. శివగామి ని చూసి నాకు మాట రాలేదు. అసలు ఆ సినిమా కే హైలెట్ శివగామి పాత్ర. అందుకే అన్నీటి కంటే ముందు శివగామి కోసమే మాట్లాడు కోవాలి. మాహిష్మతి సామ్రాజ్య రాజమాత అయిన శివగామి , అప్పటి రాజు తమ్ముడు బిజ్జాలదేవ భార్య. ఆమెకు ఒక మగ సంతానం. కాలం కలిసోచ్చో , శాపమో ఆమెకు సింహాసనాన్ని దక్కించుకునే అవకాశం వస్తుంది. కాని ఆ పదవికి తాను అర్హురాలు కాదు అని , చిన్నపుడే తల్లి తండ్రి ని కోల్పోయిన బాహుబలి కి ‘సగం’ పాలు పంచి తన కొడుకు తో సమానం గా చూసుకోవడం ఒక భారత స్త్రీ హిమాలయాల అంత ఉన్నతని చూపించింది శివగామి.

తన మాటే శాసనం లా రాజ్యం క్షేమం కోసం పాటుబడింది.ఓ పక్క తన సొంత కొడుకుని సింహాసనం ఎక్కించమని తన భర్త తో పాటు , చుట్టూ ఉండే వారు కోరుకుంటున్నా వారిని పక్కన పెట్టి ఇద్దరు “కొడుకులకు” సింహాసనం ఎక్కడానికి సమాన అవకాశాలు ఇచ్చి, నెగ్గిన వాడికే ఆ అవకాశం ఇస్తాను అని దృడ నిశ్చయం తో ఉండటం శివగామి ని మరో మెట్టు పైన నుంచోపెట్టింది. తన తప్పుకు తానే మరణం విధించుకుని బాహుబలి కొడుకు ని కాపాడిన త్యాగ శీలి. భారతీయ స్త్రీ అంతే అనుకుంటా. ఎందరో స్త్రీలు కేవలం తన కోసం కాక తన కుటుంభం సంక్షేమం కోసమే బ్రతకడం ఈ అనంత విశ్వం లో మరెక్కడా దొరకదు ఏమో విక్రమార్కా … అటువంటి శివాగామి లకు పాదాభివందనం. అటువంటి శివగామి లను కన్న భారతావని కి సాష్టాంగ నమస్కారం.

కట్టప్ప :-

Sathyaraj’s-Kattappa-first-look-800x400

ఇక రెండో వ్యక్తి కట్టప్ప. ఇతను కోసం చెప్పడానికి ఈ రాత్రి అంతా సరిపోదు అనుకుంటా. సత్యరాజ్ చేసిన ఈ పాత్ర అతనకు సరిగ్గా సరిపోయింది. ఒక విశ్వాసమైన బంటు ఒక కుటుంభానికి ఎంత వరకూ సేవ చేయగలరు అంటే , ప్రాణ త్యాగానికైనా సిద్దమే అంటాడు కట్టప్ప. ఎంత పరాక్రమ వంతుడైనా , రాజును సైతం ఎదిరించ గలిగే సత్తా ఉన్నా , తన స్థానం మాత్రం ఎప్పుడు కాళ్ళ దగ్గరే అని చెప్పే కట్టప్ప వంటి వారి వలనే నేటికి రాజులు అని చెప్పుకుంటూ వారు పరిపాలన చేస్తున్నారు. అంతా పల్లకి ఎక్కుతా అంటే మోసేవాడెవడు అని అడిగే కట్టప్ప , ఆ పల్లకీని భుజాన వేసుకోడానికి ఎప్పుడూ ముందు ఉంటాడు. తన తరతరాలను మాహిష్మతి సామ్రాజ్య ఉన్నతినికి మాత్రమే అని ఎప్పుడో ఇచ్చిన మాట కోసం అలా కట్టుండిపోయిన కట్టప్ప లాంటి వారిని ఎందరినో ఈ మాయదారి కాలం తనలో కలిపేసుకుని మరుపు అనే పూత పూసేసింది.

 రాజు విగ్రహ ప్రతిష్ట అవసరమో లేదు నాకు తెలిదు కానీ విక్రమార్కా … కట్టప్ప విగ్రహం అయితే తప్పని సరిగా ఉండాలి. తరువాత తరం వారికి పల్లకి ఎక్కే వాడే కాదు, తన కర్తవ్యం సరిగా చేసే “భోయ” కు కూడా తగిన గౌరవం లభిస్తుంది అని నమ్మకం కుదిరి , ఎప్పుడూ రాజు అవ్వాలనే అనుకోకుండా కర్తవ్యం ఎంత సవ్యంగా చేయాలనే దాని మీద దృష్టి పెడతారని నా నమ్మకం. ఇచ్చిన మాట నిలిపమని చెప్పే కట్టప్ప ను కన్నా తండ్రి కి నా వందనాలు. అటువంటి కట్టప్ప లను కన్న తల్లులకు నా సాష్టాంగ నమస్కారం.

భలాలదేవ:-

bhal

రాముడు ఉన్న చోట రావణుడు ఉంటాడు. రావణుడు ఎంత భలమైన వాడై రాముడికి అంత పెద్ద కష్టం పెడితే , అది దాటి రాముడు ఇంత దేవుడవుతాడు. భల్లాలదేవ పాత్ర చేసింది రామా నాయుడు దగ్గుబాటి. అంతా రానా అని పిలిచినా , తన తాత పేరు రెండితలు చేసే సందర్భాలలో అయినా ఆ మహానుబావుణ్ణి తలుచుకోవడం నాకు ఇష్టం. బహుసా అందుకే మనకి మన పెద్ద వారి పేర్లను వారసత్వంగా ఇచ్చేది. ఇక ఈ భల్లాలదేవ ఎంత పరాక్రమ వంతుడంటే , మధించిన దున్నపోతును చేతులతో గుద్ది చంపేయగలడు. పరమ కఠినాత్ముడు. దేవుడిని నమ్మడు. దేవుడిని తనతో సమానం అని తనకు ఓ స్వర్ణ విగ్రహం ఏర్పాటు చేసుకునే వాడు. యుద్ధ రంగం లో గధా ప్రావీన్యుడు. “బలమైన బాహువులతో” చేసే విన్యాసాలు చూడటం నిజంగా భయంగాను ముచ్చటగానూ ఉంటాయి .తనకు ఇచ్చిన పాత్రకు 100 కి వంద శాతం న్యాయం చేసిన రానాకు అవార్డులు కూడా వెనుక రావడం ఖాయం. జనాలకు ఎప్పటికీ బల్లలదేవ గుర్తుండిపోతాడు.

దేవసేన :-

anu

జేజమ్మ గా పరాక్రమం చూపిన అనుష్క , సంకెళ్ళ తో సంవత్సరాలుగా సావాసం చేస్తూ , మొత్తం మొఖం కమిలిపోయి , డిగ్లామరజైడ్ రోల్ చేయడం, దానికి నూటికి 100 శాతం న్యాయం చేయడం చాలా బాగుంది. తనను విడింపించటానికి తన కొడుకు తప్పక వస్తాడని కట్టప్ప తో చెప్పే డైలాగ్ తో కట్టప్పే కాక జనాలు , బెతాలుడైన నేను కూడా జడసిపోవడం జరిగింది. నేను జడిసిపోవడం ఎవరూ చూడలేదు అని నిర్ధారించుకుని మిగతా సినిమా చూసాను. రెండో బాహుబలి లో దేవసేన ను చూడాలి అని ‘బేతాళుడు’ వేచి చూస్తున్నాడు.

కాలకేయ:-

kal

ఒళ్లంతా నలుపు తో భీకరమైన రూపంతో నన్ను కూడా జడిపించేసాడు కాలకేయ. ప్రభాకర్ చాలా బాగా చేసాడు. సినిమా భారీ హిట్ అవడానికి ఇతను కూడా ఒక ముఖ్య కారణం. అతను , అతని పరివారం మాట్లాడే కొత్త రకం భాష ఆఫ్రికా లో మాట్లాడే “క్లిక్ భాష” కు దగ్గరగా ఉంటుంది అని మొన్న ఓ మిత్రుడు చెప్పాడు. మొత్తానికి ప్రభాకర్ కు మంచి పాత్ర దొరికింది.

 ఇలా ఈ ఐదుగురు వలాన ముఖ్యంగా సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది(నటి నటులు /పాత్రలలో).తెలుగు వారి కీర్తి ని హిమాలయాలను తాకించింది. ఇప్పుడు చెప్పు రాజా విక్రమార్క , నేను చెప్పిన పాత్రలు ఏ సినిమా లోనిది… ? తెలిసీ సమాధానం చెప్పకపోతే తల టెన్ తౌసెండ్ పీసెస్ అయిపోతాయి చూసుకో.

 బేతాళా , నువ్వు ఏదో భయంకర కధలు అవీ చెప్పి ఆన్సేర్ చేయలేని క్వచెన్స్ వేస్తావని బయట టాక్ ఉంది. ఈ మాత్రం సినిమా పేరు అడగటానికి ఇంత సోది చెప్పాలా … మళ్లీ తెలిసీ చెప్పకపోవడమా .. హ హ హ … నువ్వు ప్రొజెక్టర్ ఎక్కి చూసిన “బాహుబలి” నీ ఫేస్భుక్ ఓపెన్ చేసి చూసుకో. అంతా దాని కోసం తప్పితే మరి దేనికోసమూ మాట్లాడుకోవడం లేదు. అది సరే కాని హిట్ అవడానికి కారణాలు అన్నావు .. అందులో “బాహుబలి” ఎక్కడా … ??

మౌన భంగం చేసిన బేతాళుడు పెద్దగా నవ్వుతూ తిరిగి చేట్టేక్కేసాడు.

పట్టు వదలని విక్రమార్కుడు బేతాళుడు సంగతి రేపు చూద్దాం లే అనుకుని ఆన్ లైన్ లో బాహుబలికి మిడ్ నైట్ షోకి బుక్ చేసుకున్నాడు.

మూర్తి కనకాల

 

Courtesey: http://sandmafia.me

మరిన్ని సినిమా కబుర్లు