Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
anushka busy with movie production

ఈ సంచికలో >> సినిమా >>

హీరోగా, నిర్మాతగా టెన్షన్‌ టెన్షన్‌

tention as hero & producer

ఈ ఏడాది కళ్యాణ్‌రామ్‌కి మంచి విజయంతో గుడ్‌ బిగినింగ్‌ లభించింది 'పటాస్‌' సినిమా రూపంలో. 'పటాస్‌' సాధించిన విజయంతో జోరు మీదున్న కళ్యాణ్‌రామ్‌, ఈ ఆగస్ట్‌లో 'షేర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'పటాస్‌'లానే 'షేర్‌' కూడా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అట. సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తయిపోయింది. విదేశాల్లో చిత్రీకరించాల్సిన ఒక్క పాట బ్యాలెన్స్‌ ఉంది. అది కూడా ఈ నెలలో పూర్తయిపోనుంది. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుని, ఆగస్ట్‌లో 'షేర్‌' ప్రేక్షకుల ముందుకు వస్తుంది. హీరోగా ఈ సినిమా గురించి ఎంతో టెన్షన్‌ పడుతున్నాడు కళ్యాణ్‌రామ్‌. అలాగే ఆగస్ట్‌లోనే కళ్యాణ్‌రామ్‌కి ఇంకో టెన్షన్‌ ఉంది. అదే 'కిక్‌ 2' సినిమా. రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కళ్యాణ్‌రామ్‌ నిర్మాత. వేసవి కాలంలోనే సినిమా విడుదల కావాల్సి ఉన్నా కొన్ని కారణాలతో వాయిదా పడ్డ 'కిక్‌ 2'ని కూడా 'షేర్‌'తోపాటే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాడట కళ్యాణ్‌రామ్‌. ఓ వారం రోజులు దానికీ దీనికీ గ్యాప్‌ ఉండవచ్చునని సమాచారం. ఏదేమైనా హీరోగా ఓ సినిమాతో, నిర్మాతగా ఇంకో సినిమాతో కళ్యాణ్‌రామ్‌కి ఆగస్ట్‌ ఓ స్పెషల్‌ థ్రిల్‌ ఇవ్వబోతుందన్నమాట.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondichooddam