Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

సినిమా 'సీజీ'లో మనోళ్ళే టాప్‌

we are the toppers in CG technology
సినిమాకి 'సీజీ' చాలా ఇంపార్టెంట్‌ ఇప్పుడు. దాదాపు ప్రతి సినిమా సీజీపై ఏదో ఒక రకంగా ఆధార పడుతోంది. కొన్ని సినిమాలకైతే 'సీజీ'నే ప్రాణం పోస్తోంది. సాంకేతిక రంగంలో పెను విప్లవంగా 'సీజీ'ని చెప్పవచ్చు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపే సీజీతో వెండితెరపై అద్భుతాలు సాధిస్తున్నాం. అంతర్జాతీయ సినిమాలకు ధీటుగా మన తెలుగు సినిమా 'సీజీ' పరంగా ఎదుగుతోంది. తెలుగులో 'ఐరిస్‌' సత్య పలు సినిమాలకు సీజీ నిపుణుడిగా పనిచేశాడు. 'ఎర్రబస్సు', 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలకు పనిచేసిన సత్య, 'అఖిల్‌' సినిమాకి కూడా సీజీ అందించాడు. అయితే అన్ని సందర్భాల్లోనూ సీజీ తెలుగు సినిమాకి ప్రాణం పోయలేకపోతోంది.

టాలెంట్‌ ఉన్నా ఒక్కోసారి, టైమ్‌ దాంతోపాటుగా తగినంతగా ఖర్చు చేసేందుకు నిర్మాతలు ముందుకు రాకపోవడంతో గ్రాఫిక్స్‌ క్వాలిటీ తగ్గుతోందని నిపుణులు చెప్తారు. హాలీవుడ్‌ సినిమాలకు పనిచేసే సీజీ టీమ్‌లో ముఖ్య విభాగాలు మన ఇండియన్స్‌ చేతుల్లోనే ఉంటాయంటే, మన టాలెంట్‌ ఏంటన్నది ఈజీగా చెప్పవచ్చు. మన సినిమాకి ఉన్న పరిమిత వనరుల దృష్ట్యా ప్రతిసారీ అద్భుతాలు సాధ్యం కావడంలేదు. రాజమౌళి లాంటి అతి కొద్ది మంది మాత్రమే సీజీని సరిగ్గా వాడుకోగలుగుతున్నారు. 
మరిన్ని సినిమా కబుర్లు
akhil in top 5 heroes..