Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nandamuri family - sankanti festival

ఈ సంచికలో >> సినిమా >>

వెండి తెరపై అందమైన దెయ్యాలు

beautiful devils on silver screen
ఇదివరకటి రోజుల్లో హారర్‌ మూవీస్‌ అంటే ఒకటీ అరా వచ్చేవి. అవి కూడా కొంతమందినే అలరించేవి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో హారర్‌ సినిమాలకు కామెడీని జోడించి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తున్నారు. అందుకే ఆ తరహా చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. అంతేకాదు ఇలాంటి సినిమాల్లో నటించడానికి అందమైన ముద్దుగుమ్మలు ఎక్కువ ఆశక్తి చూపుతున్నారు కూడా. 'ప్రేమకధాచిత్రమ్‌'తో మొదలై 'గీతాంజలి', 'త్రిపుర'..ఇలా ఈ హారర్‌ కామెడీ చిత్రాల్లో నందిత, అంజలి, స్వాతిల్లాంటి ముద్దుగుమ్మలు దెయ్యాల్లా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో హన్సిక, త్రిష కూడా చేరిపోయారు. ఇప్పటికే హన్సిక 'చంద్రకళ' సినిమాలో దెయ్యంలా నటించింది. ఇక త్రిష విషయానికొస్తే ఆమె నటిస్తున్న 'నాయకి' సినిమా హరర్‌ టచ్‌ ఉన్న సినిమానేనట. ఇది కాక 'చంద్రకళ ' సీక్వెల్‌లో త్రిష దెయ్యంగా నటించి భయపెడతానంటోంది. ఈ సినిమాలో త్రిషను అందమైన దెయ్యంగా తీర్చిదిద్దుతారట. అందంతోనే త్రిష భయపెడ్తుందట మరి. ఇలా మన అందమైన హీరోయిన్లు తెరపై దెయ్యాల్లా మారి భయపెడుతూ అలరిస్తాయంటున్నారు. 
మరిన్ని సినిమా కబుర్లు
ready to  release bagavad ramanujulu