'ఒకటో నెంబర్ కుర్రాడు' అంటూ తెలుగు సినిమా తెరంగేట్రం చేసిన మరో నందమూరి నటసింహం తారకరత్న. హీరోగా ఉండవల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నప్పటికీ తగిన గుర్తింపు మాత్రం దక్కలేదు. 'అమరావతి' సినిమాలో మొదటి సారి నెగిటివ్ రోల్‌లో కనిపించి ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్నాడు. ఆ సినిమాలో విలన్‌గా చేసినప్పటికీ సినిమా మొత్తం తన పాత్ర చుట్టూనే తిరుగుతూ తారకరత్న క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. అదే తరహాలో ఇప్పుడు వారాహి బ్యానర్‌లో సాయి కొర్రపాటి ప్రొడక్షన్‌లో 'రాజా చెయ్యి వేస్తే' అనే సినిమాలో మళ్లీ విలన్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు తారకరత్న.
ఈ సినిమాలో నారా రోహిత్ హీరోగా నటిస్తున్నాడు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సోదరుడి తనయుడే నారా రోహిత్. అలా ఫ్యామిలీలోని ఓ హీరోతో తారకరత్న విలన్‌గా తెరపై తలపడపబోతున్నాడన్నమాట. హీరోతో సమానంగా ఉండేలా తారకరత్న క్యారెక్టర్‌ను కూడా డిజైన్ చేశారట డైరెక్టర్. ఈ సినిమాతో విలన్ పాత్రలకు మంచి న్యాయం చేసినట్టయితే తారకరత్నకి ముందు ముందు ఇలాంటి అవకాశాలు చాలా వచ్చే అవకాశముంది.
|