Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
we are the toppers in CG technology

ఈ సంచికలో >> సినిమా >>

టాప్‌ 5 హీరోల్లో అక్కినేని అఖిల్‌!

akhil in top 5 heroes..
అక్కినేని అఖిల్‌ హీరోగా నటించిన 'అఖిల్‌' సినిమా దీపావళి కానుకగా రిలీజయ్యి నిజమైన దీపావళి పండగ చేసుకుంది. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన దీపావళి టపాసు సూపర్‌గా పేలింది. చిన్నప్పుడే సిసింద్రీగా తన పవర్‌ను చూపించిన అఖిల్‌ ఇప్పుడు హీరో అయ్యి డైనమైట్‌లా తన టాలెంట్‌ను చూపించాడు. డాన్సులు, ఫైట్స్‌తో పూర్తి మాస్‌ లక్షణాలు తనలో ఉన్నాయని మొదటి సినిమాతోనే నిరూపించుకున్నాడు. మొదటి సినిమానే అయినప్పటికీ చాలా మెచ్యూర్డ్‌గా నటనలో వేరియేషన్స్‌ చూపించాడు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన డాన్స్‌ సూపర్‌స్టార్‌ అఖిల్‌ అని అభిమానులు పిచ్చపిచ్చగా పండగ చేసేస్కుంటున్నారు.

అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా మంచి ఓపినింగ్స్‌ తీసుకువచ్చింది. హీరోకి ఇది తొలి సినిమానా? అని అ ప్రేక్షకులు ఆశ్చర్యపోయేంతలా అఖిల్‌, స్క్రీన్‌ మీద ఎనర్జీ చూపించాడు. తొలి సినిమాకే ఇలా ఉంటే, తర్వాత సినిమాలకి అతని ఎనర్జీ ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయలేం. డాన్సుల్లో చరణ్‌, ఎన్టీఆర్‌లకు తగిన పోటీ ఇవ్వగల కత్తిలాంటి హీరో కూడా అఖిల్‌. ఈ విషయంలో నో డౌట్‌! మాస్‌ కమర్షియల్‌ హీరోకి కావాల్సిన లక్షణాలు తనలో ఉన్నాయని ప్రూవ్‌ చేసిన అఖిల్‌, నిఖార్సయిన సినిమా పడితే, టాలీవుడ్‌ టాప్‌ 5 హీరోల్లో చోటు దక్కించేసుకుంటాడు. 
మరిన్ని సినిమా కబుర్లు
tarakaratna as vilan once again