|
నాన్న: ఆ అమ్మాయిని చేసుకోవా? ఎందుచేత ?
కొడుకు: నాకు నచ్చలేదు. ఆ అమ్మాయినీ, నన్ను పక్క పక్కన చూస్తే మమ్మల్ని తల్లీ కొడుకులనుకొంటారు ఎవరైనా!
నాన్న: ఐతే నేను చేసుకొంటాను పో!! |
|
మొగుడు: నీ తల్లోని పేలన్నీ నా తల్లోకెక్కాయ్!
పెళ్ళాం: ఏం కాదు లెండి. విగ్గే కదా. తీసి ఎండలో పెట్టండి. పేలు చస్తాయ్! |
|
|
|
కొడుకు: నేను అమెరికా వెళతాను నాన్నా.
తండ్రి: ఒద్దురా బాబు. అక్కడికి నువ్వు తిరిగి రావు.
కొడుకు: ఉద్యోగం కుదిరాక, వస్తాను నాన్నా! మిమ్మల్ని తీసుకెళ్తాను.
తండ్రి: అక్కడ నేనుండలేనురా! నువ్వు జాబ్ కెళ్ళి పోతే నేను బిక్కు బిక్కు మంటూ ఒంటరిగా ఉండాలి.
కొడుకు: నీకు తోడుగా ఒక 'నానీ' ని ఏర్పాటు చేస్తాను నాన్నా.
తండ్రి: ఐతే పద! ఇప్పుడే అమెరికా పోదాం పద! |
|
కుంతి: బకాసురుడ్ని చంపావ్ సరే! తోలుకెల్లిన ఆ బండెడు భోజనం ఏం చేశావ్ రా?
భీముడు: నేను తినేశానమ్మా!
కుంతి: ఒక్కడివి మొత్తం తినేశావా?
భీముడు: మొత్తం కాదమ్మా... దున్నపోతులూ, బండినీ వెనక్కి తోలుకోచ్చానుగా!! |
|
|
|
భార్య: లైటు తీసెయ్యండి. నాకు సిగ్గేస్తుంది.
భర్త: ఈ కొంపలో అది కూడానా? నెల్లాళ్ళనుంచి కరెంటు లేదుగా! |
|
డాక్టర్: మీ కంటి ఆపరేషన్ తర్వాత మీ చూపు ఎలా వుంది?
పేషంట్: నాకు మొత్తం కనిపిస్తున్నాయండీ!
డాక్టర్: అమా నర్స్.... నువ్వా గదిలోకి వెళ్ళమ్మా!! |
|
|
|
క్రికెట్ కోచ్: దృష్టి పూర్తిగా బాల మీదే వుండాలి. డ్రాప్ చెయ్యకుండా క్యాచ్ చెయ్యాలి
క్రికెట్ ప్లేయర్: అది నా చేతిలో లేదు. బెట్టింగ్ కట్టేవాడిని బట్టి, నేను బాల్ ని క్యాచ్ చెయ్యాలో, డ్రాప్ చెయ్యాలో స్పాట్ లో డిసైడ్ చేస్తాను. |
|
రాక్షస వైద్యుడు: శాకాహారులని తిన్నావా? మాంసాహారులని తిన్నావా?
రాక్షసుడు: శాకాహారులని వైద్యా!
రాక్షస వైద్యుడు: అందుకే నీకు విరేచానాలవుతున్నాయి! ఆహార నియమాలు సరిగ్గా పాటించాలి. సరేనా? |
|
|
|
సేవకుడు: మహారాజా, కవచాన్ని ఛాతికి పెట్టుకోక వీపుకు తగిలించుకున్నారే?
మహారాజు: మనం పరుగు లంకించుకుంటే శత్రు బాణాలు వీపుకు తగలకుండా వుండడానికిరా, బడుద్ధాయ్!! |
|
మగ లవర్: ప్రియామణీ, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. సారీ!
ఆడ లవర్: ఏం? ఎందుకూ?
మగ లవర్: నాకు ఎయిడ్స్ వుంది.
ఆడ లవర్: నాకూ ఉందీ! నో ప్రాబ్లమ్!! |
|