Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
who is tarakaratna ?

ఈ సంచికలో >> సినిమా >>

జోరు పెంచిన నారా వారబ్బాయ్‌

nara rohit increased speed

'బాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన చాకులాంటి కుర్రాడు నారా రోహిత్‌. తొలి సినిమాతోనే తనలో విషయం ఉందని నిరూపించుకున్నాడు. కానీ ఇంత వరకూ అదృష్టం దక్కలేదు. 'సోలో' సినిమాతో నటనలో తనేంటో ప్రూవ్‌ చేసకున్నాడు. ఆ తర్వాత సినిమా సినిమాకూ కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో తన రూటే సెపరేటు అంటూ ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. రోహిత్‌ హీరోగా తెరకెక్కుతున్న 'సావిత్రి', తుంటరి' సినిమాలు షూటింగ్‌ పూర్తి చేసుకుని, విడుదల డేట్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్నాయి.

త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇవి కాక నారా రోహిత్‌ చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి. కుమార్‌ నాగేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'తుంటరి' సినిమా మార్చి మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నారా రోహిత్‌కు జోడీగా లతా హెగ్దే నటిస్తోంది. కుమార్‌ నాగేంద్ర దర్శకుడు. ఏదేమైనా, ఈ ఏడాదంతా క్షణం తీరిక లేకుండా వరుస సినిమాల రిలీజ్‌లతో బిజీ బిజీ అయిపోనున్నాడట నారా వారబ్బాయ్‌. చాలా సినిమాలు క్యూలో ఉన్నా, కొత్త కథలు వినడంలో ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా అవకాశాలు దక్కించుకుంటున్న నారా రోహిత్‌కి ఈ ఏడాది కలిసి రావాలని ఆశిద్దాం. 

మరిన్ని సినిమా కబుర్లు
balakrishna recent  film biographies of the late NTR?