Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ కెవ్వు కేక

sardar gabbar singh kevvu keka

తాజాగా విడుదలైన 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' ట్రైలర్‌ అదిరిపోయింది. పవన్‌ కళ్యాణ్‌ సూచనల మేరకు కట్‌ చేసిన ట్రైలర్‌కు ఫ్యాన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ట్రైలర్‌లోనే సినిమా స్టోరీ రివీల్‌ చేసిన పవన్‌ గట్స్‌కు నిజంగా హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే. ఇక హీరోయిన్‌ కాజల్‌ విషయానికొస్తే ఈ సినిమాలో రాజకుమారి పాత్రలో చాలా అందంగా కనిపిస్తోంది. దేవిశ్రీ అందించిన పాటలు కెవ్వు కేక అన్పించేంతలా ఉన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న ఈ సినిమా ఏప్రిల్‌ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే కూడా పవన్‌ కళ్యాణ్‌దే. 'గబ్బర్‌ సింగ్‌' సినిమాను మించిన యాక్షన్‌ ఎమోషన్స్‌తోపాటు కామెడీని కూడా 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ద్వారా ప్రేక్షకులకు పంచుతామని పవన్‌ కళ్యాణ్‌ బల్ల గుద్ది చెబుతున్నారు. ఇప్పటికే 100 కోట్ల మార్కెట్‌ జరిగిందనే ప్రచారం నేపథ్యంలో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సమ్మర్‌కి తెలుగు ప్రేక్షకుల్ని అలరించనున్న భారీ చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' అనడం నిస్సందేహం. కథ, స్క్రీన్‌ప్లే అందించడమే కాకుండా, సినిమా ప్రమోషన్‌ కోసం పవన్‌కళ్యాణ్‌ చేస్తున్న ప్రయత్నాలు చాలానే. సినిమాకి తాను కూడా ఓ నిర్మాత కావడంతో ప్రచార బాధ్యతల్ని కూడా పవన్‌ తన భుజానికెత్తుకున్నాడు. ఈ మధ్య తమ సినిమాలకు నిర్మాణ సహకారం అందిస్తూ బీభత్సమైన హిట్స్‌ కొడుతున్నారు పలువురు హీరోలు. ఆ కోవలో 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' కూడా కెవ్వు కేక అన్పించుకుంటుందేమో చూడాలిక

మరిన్ని సినిమా కబుర్లు
no for glamour characters