Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
no for glamour characters

ఈ సంచికలో >> సినిమా >>

అస్సలు దాచుకోనంటున్న తమన్నా

she dont want to hide

ప్రస్తుతం హీరోయిన్లు ఒళ్లు దాచుకోకుండా గ్లామర్‌ ప్రదర్శన చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిందే. మోకాళ్లు దాటని గౌన్లు, స్లీవ్‌ లెవ్‌ టాప్స్‌ కామన్‌ అయిపోయాయి. అయితే మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం తన డ్రెస్సింగ్‌ విషయంలో డైరెక్టర్‌ ఎలా చెబితే అలా చెయ్యాలి తప్పదు.. దాన్నే గ్లామర్‌ అంటున్నారు. కానీ అసలు గ్లామర్‌ అంటే వేసుకునే బట్టల్లో కాదు ఆ బట్టల వెనుక దాగున్న మనసులో ఉంటుంది అంటోంది. ఇదేంటి తమ్మూ బేబీ వేదాంతం మాట్లాడుతోంది అన్పిస్తోంది కదా. ప్రస్తుతం తమన్నా 'ఊపిరి' సినిమాలో, 'బాహుబలి ది కన్‌క్లూజన్‌' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. 'ఊపిరి' సినిమాలో నాగార్జున పాత్ర తనకెంతగానో నచ్చేసిందంటోంది. అలాంటి పాత్ర నాగార్జున అంతటి సీనియర్‌ హీరో, చేయడం చాలా కీర్తించదగ్గ విషయం అని నాగార్జునని తెగ పొగిడేస్తోంది కూడా. అంతేకాదు తమన్నాకు మనసులో ఏదీ దాచుకోవడం నచ్చదంట. మనసులో ఏమన్పించినా పైకి చెప్పేస్తుందట. ముఖ్యంగా ట్విట్టర్‌లో తన ఫ్యాన్స్‌తో ప్రతీ విషయాన్ని ఓపెన్‌గానే పంచుకుంటానంటోంది. అందుకేనేమో తమన్నా అంటే ఇష్టపడనివారుండరు. సినీ రంగంలో తమన్నాకి ఉన్నంతమంది స్నేహితులు బహుశా ఇంకెవరికీ ఉండరేమో. 

మరిన్ని సినిమా కబుర్లు
balakrishna ready to horse ride