Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sardar gabbar singh kevvu keka

ఈ సంచికలో >> సినిమా >>

గ్లామర్‌ పాత్రలకు నో అంటున్న స్వీటీ

no for glamour characters

అనుష్క అంటే ఆన్‌ స్క్రీన్‌ గ్లామర్‌కూ, ఆఫ్‌ స్క్రీన్‌ గ్లామర్‌కూ ఎంతో డిఫరెన్స్‌. ఆఫ్‌ స్క్రీన్‌లో అనుష్క కట్టు బొట్టు ఎంతో సాంప్రదాయంగా చాలా హుందాగా వ్యవహరిస్తుంది. ఇక ఆన్‌ స్క్రీన్‌లో అయితే డైరెక్టర్స్‌ ఎలా చెబితే అలా. ఆన్‌ స్క్రీన్‌ గ్లామర్‌లో అనుష్క తర్వాతే ఎవరైనా. 'అరుంధతి' సినిమాకు ముందు అనుష్క వేరు. 'అరుంధతి' తరువాత అనుష్క వేరు. ఆ సినిమాతో ఆమె పాపులారిటీ అంతగా పెరిగిపోయింది. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ పాత్రలంటే అనుష్కను తప్ప మరొక హీరోయిన్‌ని ఊహించుకోలేం ప్రస్తుత రోజుల్లో. అంతే కాదు సాహసాలకు కూడా ఆమె పెట్టింది పేరు. ఆ తరహా పాత్రలే 'సైజ్‌ జీరో'లో సౌందర్య అయినా, 'బాహుబలి 1'లో దేవసేన పాత్రయినా, 'రుద్రమదేవి' సినిమాలోని రుద్రమ పాత్ర అయినా. ఒక పక్క గ్లామర్‌ రోల్స్‌ పోషిస్తూనే తెరపై నిండైన పాత్రలకు కూడా సై అంటూ, తన సత్తా చూపిస్తోంది స్వీటీ బ్యూటీ అనుష్క. ప్రస్తుతం 'బాహుబలి ది కన్‌క్లూజన్‌' సినిమా కోసం కసరత్తులు చేస్తోంది ముద్దుగుమ్మ అనుష్క. అయితే ఇకపౖెె మితి మీరిన గ్లామర్‌ పాత్రలకు నో చెప్పాలనుకుంటోందట. పాత్ర గొప్పతనాన్ని బట్టి పొదుపుగా గ్లామర్‌ను పండిస్తానంటోంది బ్యూటీ అనుష్క. 

మరిన్ని సినిమా కబుర్లు
she dont want to hide