Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pingali venkayya

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం(ఆగష్టు 09 - ఆగష్టు15) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం జాగ్రత్తగా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళుట మంచిది. శుక్ర, శని వారాలు అశుభవార్తను వినే అవకాశం కలదు. మానసికంగా దృడంగా ఉండుట సూచన. పెద్దల సూచనల మేరకు నడుచుకోవడం అనేది మంచిది. ఆది, సోమ వారాలు ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తిని పొందుతారు. చేపట్టిన పనులలో ఫలితాలను పొందుటకు అవకాశం ఉంది. మీరు చేసిన పనులకు మంగళ, బుధ వారాలలో గుర్తింపును పొందుతారు. పనిలో భారంను పొందుటకు అవకాశం కలదు. ఆరోగ్యంను అశ్రద్ద చేసినచో అనారోగ్య సమస్యల మూలాన భాదను పొందే అవకాశం కలదు జాగ్రత్త. వారంలో అధికభాగం మీరు చేపట్టిన పనులకు ఏదో ఒక రూపంలో ఇబ్బందులు కలుగవచ్చును. కావున అధికమైన శ్రద్ధను కలిగి ఉండుట మంచిది. సోదరుల నుంచి ఆశించిన విధంగా సహకారం ఉండకపోవచ్చును. ఇష్టమైన రంగంలో రాణించే అవకాశం కలదు. అ దిశగా అడుగులు వేయుట ఉత్తమం. ఉద్యోగంలో కొంత సమయపాలనను పాటించుట అలాగే అధికారులతో వారికి అనుకూలంగా నడుచుకొనుట మంచిది. భోజనం విషయంలో సంతృప్తిని పొందుతారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.     

వృషభ రాశి

ఈవారం మీరు మిశ్రమ ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. శుక్ర, శనివారాలలో కొంత అధికమైన ఆలోచనలు కలిగి ఉండుట చేత మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. పని పైన శ్రద్ధను పెట్టుట ఉత్తమం. అనుకోని సంఘటనలు జరుగుటకు అవకాశం కలదు. అశ్రద్ద కూడదు. ఆది, సోమ వారాలలో ప్రతి విషయంలో నిదానం, అలాగే జాగ్రత్త అవసరం. అనారోగ్య సమస్యలు కలుగుటకు ఆస్కారం కలదు, జాగ్రత్త వహించుట మేలు. మంగళ, బుధ వారాలలో అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. ఆర్థికపరమైన విషయంలో ఈవారం ఈరోజుల్లో సంతృప్తికరమైన వార్తను వింటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. గురువారం చేపట్టిన పనుల మూలాన అందరిలో గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. ఆదాయం పెరుగుటకు అవకాశం కలదు. నూతన పరిచయాలు కలుగుటకు ఆస్కారం కలదు. వారం కొద్దిగా శ్రమించుట చేత మంచి ఫలితాలను పొందుతారు. బందువులతో, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. మంచివారితో మీకున్న పరిచయం మేలుచేస్తుంది.  

మిథున రాశి
ఈవారం నూతన ఆలోచనలను కలిగి ఉంటారు. కొత్త పనులను చేపట్టే అవకాశం కలదు. శుక్ర, శనివారం రోజులలో ఇష్టమైన పనులలో సమయాన్ని గడుపుతారు. నచ్చిన వారిని కలుసుకొనే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. ఆది. సోమవారం ఆశించిన ఫలితాలు రాకపోవడం చేత కొంత ఆందోళన చెందుటకు అవకాశం కలదు. భోజనం విషయంలో సమయపాలన అవసరం లేకపోతే మంగళ, బుధ వారాలలో అనారోగ్య సమస్యలు తలెత్తు అవకాశం కలదు. గురువారం కుటుంబ సభ్యుల సహకారం చేత పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు వచ్చు అవకాశం కలదు. స్నేహితులతో చేయుపనిలో జాగ్రత్త అవసరం. వారి మూలాన మాటను పడవలసి రావచ్చును. ధనం ఖర్చు చేసే విషయంలో వారం మొత్తం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. ఉద్యోగంలో నిదానం అవసరం అలాగే వ్యతిరేక వర్గం విషయంలో జాగ్రత్తగా ఉండుట సూచన. 

కర్కాటక రాశి
ఈవారం మీరు ఫలితాలను ఆశించక సమయపాలన పాటించుట ఉత్తమం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శుక్ర, శని వారాలు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోండి. నూతన ఆలోచనలు చేయకండి. ఆదివారం, సోమవారం ఉల్లాసంగా గడుపుటకు అవకాశం కలదు. అనుకున్న సమయానికి పనులను పూర్తిచేయుటకు ఆస్కారం కలదు, ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. మంగళ, బుధవారాలలో పనిఒత్తిడిని కలిగి ఉండుట చేత కొంత ఆందోళన చెందుతారు. నిదానం అవసరం. నూతన నిర్ణయాలు వద్దు. గురువారం కొంత నిరాశను పొందుటకు ఆస్కారం కలదు. వారంలో సమయానికి భోజనం చేయుట ఎవ్వరితోను మాట పట్టింపులకు వెళ్ళక పోవడం మంచిది. వాహనముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు చేయకండి. వారం అకారణంగా ప్రయాణం చేయుట మూలాన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో మీరు ఆశించిన విధంగా ఫలితాలు వచ్చు అవకాశం ఉంది.  

సింహ రాశి
ఈవారం మానసికంగా దృడంగా ఉండుట మూలాన పనులను పూర్తిచేయగలుగుతారు. ప్రయత్నకార్యములలో విజయంను పొందుతారు. శుక్ర, శని వారాలు పనులయందు ఉత్సాహంను కలిగి ఉంటారు. మృష్టాన్న భోజన ప్రాప్తిని కలిగి ఉంటారు. ఆది, సోమ వారాలు కొంత పనులలో నిరాశను కలిగి ఉంటారు. కాకపోతే ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళుట ఉత్తమం. ధనంకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించుట మంచిది. మంగళ, బుధ వారాలలో నూతనవస్త్ర ప్రాప్తిని పొందు అవకాశం కలదు. ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. దూరప్రదేశం నుండి వార్తను వినే అవకాశం కలదు. గురువారం కొంత ఆందోళన చెందుతారు. ఈవారం కొంత అధికంగా ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వాటి మూలాన ధనం ఖర్చు అయ్యే అవకాశం కలదు. బంధువులతో మాటపట్టింపులకు పోకండి. నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. అకారణంగా ఏర్పడు కలహముల పట్ల జాగ్రత్తగా ఉండుట మేలుచేస్తుంది. 

కన్యా రాశి
ఈవారం ఆశించిన ఫలితాలు పొందుటకు కొంత ఓపికను ప్రదర్శించుట మంచిది. శుక్ర, శని వారాలు శారీరక శ్రమను పొందుటకు అవకాశం కలదు. అలాగే చేపట్టిన పనులలో నిదానం అవసరం. బంధువులతో మాట పట్టింపులకు పోకపోవడం సూచన. ఆది, సోమ వారాలు ఆశించిన విధంగా ధనం సర్దుబాటు అవుతుంది. సంతోషాన్ని పొందుతారు. ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. మంగళ, బుధ వారాలలో ప్రతికూల ఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది. కావున శ్రమించుట మంచిది. అనారోగ్యంను మాత్రం అశ్రద్ద చేయకండి. గురువారం గతంలో ఆరంభించిన పనులకు ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అధికారులతో మంచి సంబంధాలను కలిగి ఉండుట మూలాన లాభంను పొందుతారు. నచ్చిన వారి నుండి మీకు ఇష్టమైన వార్తలను వింటారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. బంధువులను కలుస్తారు. వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు.

తులా రాశి
ఈవారం కొంత అనుకూలమైన ఫలితాలు ఉన్నను ప్రతిపనిని ఆలోచించి చేయుట మంచిది. ఉద్యోగంలో మాత్రం ఆశించిన ఫలితాలను పొందుతారు. అధికారులతో గుర్తింపును కలిగి ఉంటారు. శుక్ర, శని వారాలలో బంధువులతో లేదా మిత్రులతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. సంతోషంగా గడుపుతారు. ఆది, సోమ వారం పని భారంను కలిగి ఉంటారు.  అనుకోని విధంగా ఖర్చును పొందు అవకాశం కలదు. ఖర్చులను అదుపులో ఉంచుకొనుట సూచన. మంగళ, బుధ వారాలలో పనులు ముందుకు సాగుతాయి. ఉత్సాహంను కలిగి ఉంటారు. గురువారం మాత్రం వ్యాపారస్థులు తొందరపాటు నిర్ణయాలు చేయకండి. అనారోగ్య సమస్యలు తప్పక పోవచ్చును. మీ అశ్రద్దకు మూల్యం చెల్లిస్తారు. ఇబ్బందులు తప్పక పోవచ్చును. జాగ్రత్త.కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. సర్దుబాటు విధానం అవసరం. పెద్దలతో మీకున్న పరిచయాలు కలిసి వస్తాయి. 

వృశ్చిక రాశి
ఈవారం కొంత అనుకూలమైన ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. కావున ప్రతి విషయంలో శ్రద్ద అవసరం. శుక్ర, శని వారాలు చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. అనుకూలమైన పనులను పొందుతారు. ఆది, సోమవారాల్లో విందులలో పాల్గొను అవకాశం కలదు. బంధువులతో అలాగే కుటుంబసభ్యులతో సంతోషంగా సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. మంగళ, బుధ వారాల్లో మాత్రం తలపెట్టిన పనుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆలోచనలను వదిలేసి పనిచేయట మూలాన ఫలితాలు వస్తాయి. గురువారం సంతృప్తికరమైన ఫలితాలను పొందుటకు అవకాశం ఉంది. నూతన అవకాశాలు వస్తాయి. కాకపోతే ఉద్యోగంలో బాగున్న కొంత ఆరోగ్యం సహకరించకపోవచ్చును. అధికారులతో నిదానంగా ఉండుట. ఎదుటివారితో మాట్లడునప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకొనుట మంచిది. వ్యతిరేక వర్గం విషయంలో జాగ్రత్తగా ఉండుట అందరిని కలుపుకొని వెళ్ళుట సూచన. స్త్రీలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండుట సూచన.

ధనస్సు రాశి
ఈవారం మీరు ప్రణాళికా ప్రకారం నడుచుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. శుక్ర, శని వారాలు కుటుంబపరంగా నూతన నిర్ణయాలు వద్దు. అందరి ఆలోచనలు వినుట సూచన. ఆది, సోమ వారాలు ప్రయత్నాలలో అనుకూలమైన ఫలితాలను కలగజేస్తాయి. నూతన విషయాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. చేయు పనులలో మాత్రం శ్రమను పొందుతారు, ఓపిక అవసరం. మంగళ, బుధ వారాలు కొంత కాలంగా ఎదురుచూస్తున్న విషయాల్లో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. నచ్చిన వారితో సమయాన్ని గడుపుతారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. కాకపోతే గురువారం చేపట్టిన పనుల మూలాన కొంత ఖర్చును పొందుటకు అవకాశం కలదు. బంధువులతో చేపట్టిన పనులలో మాటపట్టింపులకు పోకండి. కొంత ఆశించిన ఫలితాలు రావడం చేత నిరాశను పొందుటకు అవకాశం కలదు. మిమ్మల్ని మీరే ప్రత్సాహించుకోనుట ఉత్తమం. మీ ఆలోచనలను తోటివారు వ్యతిరేకించే అవకాశం కలదు జాగ్రత్త. 

మకర రాశి
ఈవారం మీరు సమాజంలో గుర్తింపు కోసం చేయు ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంది. చేపట్టిన పనులలో ఉత్సాహం చివరి వరకు కొనసాగించుట మేలుచేస్తుంది. శుక్ర, శని వారాలు చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. కుటుంబసభ్యుల్లో ఒకరి ఆరోగ్యం ఒకింత ఆందోళన కలిగించేదిగా ఉంటుంది. శనివారం మోకాళ్ళనొప్పుల మూలంగా ఇబ్బందులను పొందుటకు అవకాశం ఉంది. ఆది, సోమ వారాల్లో కుటుంబంలో నిదానంగా ఉండుట సూచన. మాటపట్టింపులకు పోకపోవడం మంచిది. మంగళ, బుధ వారాలలో నూతన ప్రయత్నాలు ఆరంభిస్తారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేయుటకు అవకాశం కలదు. ఇష్టమైన పనులలో సమయాన్ని కేటాయిస్తారు. గురువారం విందులలో పాల్గొంటారు. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో వారం చివరలో లాభంను పొందుతారు. ఇతరులకు సేవచేయుట మూలాన మంచి పేరును కలిగి ఉంటారు. ఇతరుల మూలాన కీర్తిని పొందుతారు. మీ వలన తోటివారు లాభపడుతారు. అధికారులతో కొంత ఇబ్బందులను పొందుతారు.

కుంభ రాశి
ఈవారం నూతన అవకాశాలు కలుగుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు ఆరంభిస్తారు. ప్రయత్నాలలో విజయంను పొందుతారు. నూతన వస్త్రప్రాప్తిని పొందుతారు. శుక్ర, శని వారాలలో చేపట్టిన పనుల మూలాన అందరిలో పేరును కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది. ధనాదాయం బాగుంటుంది. ఆది, సోమ వారాలలో అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం కలదు. కావున తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది. మంగళ, బుధ వారాలలో కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం కలదు. తీసుకొనే నిర్ణయాలు అందరిని ఉద్దేశంలో తీసుకుంటే మంచిది. సమయానికి భోజనం చేయుట మంచిది. చర్చలపట్ల మక్కువను కలిగి ఉంటారు. వినోదములలొ పాల్గొంటారు. మనోదైర్యంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. వాటిలో ముందుకు సాగుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో ఆశించిన విధంగా ఉంటుంది. అధికారులతో గల సంబంధాలు మీకు అనుకూలిస్తాయి. ప్రతి పనిని ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయుట మంచిది. 

మీన రాశి
ఈవారం మీరు ప్రతిపనిలో కొంత ఆలస్యంను పొందుటకు అవకాశం ఉంది. శుక్ర, శనివారాలు ఉత్సాహంను కలిగి ఉంటారు. కుటుంబ జీవితంలో సౌఖ్యంను పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తిని కలిగి ఉంటారు. ఆది, సోమ వారాల్లో చేపట్టిన పనుల మూలాన సమజంలో గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. స్త్రీ / పురుష సౌఖ్యంను పొందుతారు. మంగళ, బుధ వారాలలో ఉద్యోగంలో స్వల్ప ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం కలదు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. గురువారం నూతన పనులను ఆరంభించక పోవడం మంచిది. పెద్దల సూచనలు పాటించుట వారికి అనుగుణంగా నడుచుకొనుట మంచిది. కుటుంబంలో నూతన ఆలోచనలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుట మంచిది. వారంలో అనుకోని ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్త. మాతృసంభందమైన విషయాల్లో బాగుంటుంది. గతంలో ఆరంభించిన పనులకు ఫలితాలు కలుగుతాయి. నూతన ఆలోచనలు కలిగి ఉంటారు.  

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
guravaayanam book review