ఛాలెంజింగ్ క్యారెక్టర్స్‌కి నాగార్జున ఎప్పుడూ రెడీ ఉంటారు. అందుకే ఆయన నుండి 'ఊపిరి' సినిమా వచ్చింది. సినిమా మొత్తం వీల్ ఛైర్‌కే పరిమితమైపోయే పాత్రలో నటించడం అంటే చిన్న విషయం కాదు. అలాంటిదే మరో సాహసానికి నాగ్ రెడీ అవుతున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'ఒప్పమ్' సినిమాని తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారట. మలయాళంలో ప్రియదర్శన్ డైరెక్షన్‌లో మోహన్‌లాల్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. మోహన్‌లాల్ ఈ సినిమాలో అంధుడి పాత్రలో నటించాడు. ఆ పాత్రలో తెలుగులో నాగార్జున అయితే బావుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ విషయమై నాగార్జునతో సంప్రదింపులు కూడా జరిగినట్లు సమాచారమ్. హత్యోదంతం నేపధ్యంపై ఈ సినిమా కథ నడుస్తుంది. స్టోరీ అయితే నాగ్‌కు బాగా నచ్చిందిట. అయితే ప్రస్తుతం నాగార్జున 'ఓం నమో వేంకటేశాయ' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే కొత్త ప్రాజెక్ట్ కోసం ప్లాన్ చేస్తాడట. మూస కథలు కాకుండా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న సినిమాల్లో నటిస్తూ నాగార్జున శభాష్ అన్పించుకుంటున్నాడు. 'సోగ్గాడే' తర్వాత 'ఊపిరి' వంటి సినిమాతో వచ్చాడు. తాజాగా 'నిర్మలా కాన్వెంట్' సినిమాతో చిన్న సినిమాలకు వెన్ను దన్నుగా నిలిచి సక్సెస్ అందుకున్నాడు. భారీ చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'తో త్వరలో సందడి చేయనున్నాడు. ఇప్పుడు 'ఒప్పమ్' రీమేక్ మరో సాహసం. నిజంగా నాగ్ ది గ్రేట్.
|