సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి 151వ సినిమాకి సర్వం సిద్దం అయిపోయినట్లే. సురేందర్ రెడ్డి తెచ్చిన కథకి చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి పట్టాలెక్కించేయనున్నారట. ఈ సినిమా కూడా చరణ్ నిర్మాణంలోనే తెరకెక్కబోతోంది అని చిరంజీవి చెప్పారు. అలాగే వినాయక్, చిరంజీవితో ఇంకో సినిమా చేస్తానంటున్నాడు. అందుకోసం కథలు సిద్ధంగా ఉన్నాయట. ఇప్పటిదాకా వినాయక్ రీమేక్‌లే చేశాడు చిరంజీవితో. కానీ ఈసారి చేయబోయేది స్ట్రెయిట్ మూవీ అట. అరతేకాదు చిరంజీవి కోసం పూరి జగన్నాథ్ కూడా సిద్ధంగా ఉన్నాడని సమాచారమ్. గతంలో వెనక్కి వెళ్ళిన ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలున్నాయి.
'ఆటోజానీ' అనే టైటిల్ కూడా దానికి అప్పట్లో అనుకున్నారు. అయితే కథలో కొన్ని మార్పులను చిరంజీవి సూచించారట. అలా తాను సూచించిన మార్పులతో పూరి వస్తే, తాను రెడీ అని చిరంజీవి చెప్పారు. చిరంజీవితో ఖైదీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమా నిర్మించనున్నాడు రామ్‌చరణ్. అదే సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రానున్న సినిమా. ఆ తర్వాత అల్లు అరవింద్‌కి ఛాన్స్ ఇవ్వనున్నారు. చిరంజీవి జోరు చూస్తుంటే ఈ ఏడాదిలోనే ఇంకో సినిమా చిరంజీవి నుంచి ఆశించవచ్చు. ఇది కేవలం ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రమే కాదు. చిరంజీవి స్వయంగా చెప్పారు. గత పదేళ్లుగా ఫ్యాన్స్ చూసిన ఎదురు చూపులను, తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా అంతకు అంత ఎంటర్‌టైన్ చేస్తానంటున్నారు చిరంజీవి. అదే కదా చిరంజీవిలోని గ్రేస్ అంటే.
|