Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
megastar ready to act 151 movie

ఈ సంచికలో >> సినిమా >>

'ఓం నమో వెంకటేశాయ' టైటిల్‌లో తప్పేంటి?

what is the problem om namo venkatesaya title

దర్శక నిర్మాతలు, హీరో అనేక క్యాలిక్యులేషన్స్‌ అనంతరం తమ సినిమాలకి టైటిల్స్‌ పెడుతుంటారు. సినిమాలో హీరో పాత్ర దగ్గర్నుంచి, సినిమా కథాంశం ఇలా పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది టైటిల్‌ పెట్టేందుకు. 'ఓం నమో వెంకటేశాయ' సినిమాకి కూడా అలాగే టైటిల్‌ పెట్టారు. కానీ, దీన్ని కొందరు వివాదాస్పదం చేయాలని చూస్తున్నారు. న్యాయపోరాటం చేస్తామంటూ మీడియాకి ఎక్కారు. అయితే ఈ వివాదంపై 'ఓం నమో వెంకటేశాయ' టీమ్‌ ఇంతవరకూ పెదవి విప్పలేదు. అంత పట్టించుకోవాల్సిన వివాదంగా దీన్ని దర్శకుడు రాఘవేంద్రరావుగానీ, హీరో నాగార్జునగానీ పరిగణనలోకి తీసుకోవడంలేదేమో! ఒకవేళ వివాదం ముదిరితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో చిత్ర యూనిట్‌ దగ్గర ఇప్పటికే అస్త్రాలు సిద్ధంగా ఉంటాయి.

సినిమాల విషయంలో ఈ తగాదాలు వివాదాలు చాలా నాన్సెన్స్‌లాంటివి. అయితే ఏదో ఒక రకంగా వివాదాలు తలెత్తే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. కానీ ఆ వివాదాల వల్ల సినిమాకి వచ్చే నష్టం మాత్రం ఏమీ ఉండదు సరికదా. ఇవి సినిమా పబ్లిసిటీకి మరింత సపోర్ట్‌ అవుతాయి కూడా. అలాగేే చిత్ర యూనిట్‌ ఈ టైటిల్‌ వివాదంలో స్పందించకపోవడానికి కారణం కావచ్చు. నాగార్జున, అనుష్క, ప్రగ్యా జైస్వాల్‌, విమలారామన్‌, జగపతిబాబు ఇలా మేటి తారాగణం 'ఓం నమో వెంకటేశాయ' చిత్రంలో నటిస్తోంది. రాఘవేంద్రరావు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి ఈ సినిమాను విజువల్‌ వండర్‌లా తెరకెక్కిస్తున్నారు. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam