Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Indraganti Music Magic

ఈ సంచికలో >> సినిమా >>

తెలుగు జర్నలిస్టులపై సినిమా

Film on Telugu Journalists

తెలుగులో ‘రిపోర్టర్‌’ అనే ఓ సినిమా రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు ఎన్‌.శంకర్‌ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. జర్నలిజం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. ప్రతి జర్నలిస్ట్‌ మెచ్చేలా ఈ సినిమా వుంటుందని చిత్ర దర్శకుడు కత్తి మహేష్‌ అన్నారు. ఎన్‌.శంకర్‌ తప్ప పేరున్న ప్రముఖులెవరూ ఈ సినిమాలో లేకపోయినా, పబ్లిసిటీని కొత్తగా ప్లాన్‌ చేసి, సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల అటెన్షన్‌ సంపాదించగలుగుతున్నారు. ఆన్‌ లైన్‌ ప్రమోషన్‌ చాలా బాగా చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా పట్ల చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. జర్నలిస్టుల కీర్తి పెంచేలా సినిమా వుంటుందని రూపకర్తలు చెబుతుండడంతో, జర్నలిస్టులూ సినిమా గురించి మాట్లాడుకుంటుండడం ఈ సినిమాకి అదనపు పబ్లిసిటీని తెస్తోంది. సినిమా నిర్మాణంలో ప్రచారం ఓ ముఖ్యమైన భూమిక పోషిస్తోంది. సినిమా పబ్లిసిటీ కోసం విధిగా కొంత మొత్తం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులున్నాయి.

ఆన్‌ లైన్‌ ద్వారా ఆ ఖర్చు తగ్గించుకునేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటున్నాయి చిన్న సినిమాలు. ‘రిపోర్టర్‌’ సినిమాకి ఉచితంగా దొరుకుతున్న పబ్లిసిటీతో, సినిమాపై రిలీజ్‌కి ముందు అంచనాలు బాగా పెరిగే అవకాశముంది.

మరిన్ని సినిమా కబుర్లు
Poets and Singers Meet at Palakollu