Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఉంగరాల రాంబాబు పొట్ట పెంచాడు

sunil act  different  roal

సునీల్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఉంగరాల రాంబాబు'. కె.క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. గతంలో కమెడియన్‌గా తన కామెడీతో ఆకట్టుకున్న సునీల్‌, హీరో అయ్యాక ఫిజిక్‌ విషయంలో చాలా ఛేంజ్‌ అయిపోయాడు. ఏకంగా స్టార్‌ హీరోలతో సమానంగా సిక్స్‌ పాక్‌ కూడా చేసేశాడు. అయితే తాజా చిత్రంలో మాత్రం సునీల్‌ సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించడట. అంటే కొంచెం లావుగా పొట్టతో కనిపిస్తాడట. ఎందుకంటే కథకి తగ్గట్లుగ్లా ఈ సినిమాలో హీరో పాత్రని అలా డిజైన్‌ చేశారట డైరెక్టర్‌ క్రాంతి మాధవ్‌.

అందుకే సునీల్‌ కష్టపడి కొంచెం పొట్ట పెంచేశాడట ఈ సినిమా కోసం. డైరెక్టర్‌ కోరిక మేరకే తన సిక్స్‌ ప్యాక్‌ని వదిలేసి ఈ ఫ్యామిలీ ప్యాక్‌కి ఫిక్స్‌ అవ్వాల్సి వచ్చిందంటున్నాడు ఈ భీమవరం బుల్లోడు. ఇంతవరకూ హీరోగా హ్యాండ్‌సమ్‌ లుక్స్‌ని మెయింటెన్‌ చేసిన సునీల్‌ ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్‌తోనే హీరోగా నవ్వులు పూయిస్తానంటున్నాడు. ఈ సినిమా ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోందట. లావుగా ఉన్నా కానీ సునీల్‌ ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా డాన్సులు ఇరగదీసేస్తున్నాడు. ముద్దుగుమ్మ మియా జార్ట్‌ ఈ సినిమాలో సునీల్‌కి జంటగా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమాని ఈ సమ్మర్‌కి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
rakul  serious warning