Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
indrakanti  compleate telugu director

ఈ సంచికలో >> సినిమా >>

కిట్టుగాడు ఓ చిలిపి దొంగ

raj tarun was thief

కుక్కల్ని ఎత్తుకెళ్లడమే కాదు కిట్టుగాడిలో మరో యాంగిల్‌ కూడా ఉంది. అమ్మాయిల మనసుని కూడా ఇట్టే దొంగిలించేస్తాడు మనోడు. అలాగే ఓ అమ్మాయి మనసుని కొల్లగొట్టాడు. అసలు కిట్టుగాడు కుక్కల్నే ఎందుకు కిడ్నాప్‌ చేస్తున్నాడు. వేరే ఇంకేదైనా దొంగతనం చేయవచ్చు కదా. అంటే అందుకు ఓ పే..ద్ద స్టోరీ కూడా ఉందటండీ. అదేంటో తెర పైనే చూడాలంటున్నాడు మన కిట్టుగాడు.

అదేనండీ యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌. ఎందుకంటే 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' సినిమాలో హీరో రాజ్‌ తరుణే కాబట్టి. మనోడికి జంటగా 'మజ్ను' ఫేం అనూ ఇమ్మాన్యుయేల్‌ నటిస్తోంది. అమ్మడు ఈ సినిమాలో చాలా గ్లామరస్‌గా కనిపించబోతోందట. ఇప్పటికే ట్రైలర్‌ చూస్తేనే తెలుస్తోంది ఈ బ్యూటీ గ్లామర్‌. ఇక సినిమాలో ఇంకెంత చేసిందో చూడాలి మరి. ఫిబ్రవరి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ ఆలస్యమైంది. మార్చి 3న విడుదల కానుంది. ఆకెళ్ల వంశీ కృష్ణ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఐటెం బాంబ్‌ హంసా నందిని ఐటెం సాంగ్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌ కానుంది. అలాగే బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ కీలకపాత్రలో నటిస్తున్నాడు. మొత్తానికి కిట్టుగాడు ఈ సినిమా పిచ్చ పిచ్చగా నవ్వించేయడానికి అతి త్వరలోనే వచ్చేస్తున్నాడన్న మాట. 

మరిన్ని సినిమా కబుర్లు
puri jagan   rog movie comming soon