Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
raj tarun was thief

ఈ సంచికలో >> సినిమా >>

'రోగ్‌' - 'ఇడియట్‌'కి మించి!

puri jagan   rog movie comming soon

రవితేజని స్టార్‌గా మార్చిన చిత్రం 'ఇడియట్‌'. ఆ సినిమాతో సరికొత్త హీరోయిజంని తెలుగు తెరకు పరిచయం చేశాడు దర్శకుడు పూరి జగన్నాథ్‌. 'చంటిగాడు లోకల్‌' అని ఆ సినిమాలో హీరో చెప్పే డైలాగ్‌, అందులోని హీరో మేనరిజమ్స్‌ ఇప్పటికీ యూత్‌ని వెంటాడుతూనే ఉన్నాయి. అంతలా యూత్‌ మీద 'ఇడియట్‌' బలమైన ముద్ర వేసిందనడం నిస్సందేహం.

ఆ తర్వాత పూరి జగన్నాథ్‌ కెరీర్‌లో ఎన్నో హిట్స్‌ ఉన్నా, 'ఇడియట్‌' ఎప్పటికీ ఆయనకి వెరీ వెరీ స్పెషల్‌గానే ఉంటుంది. మళ్లీ 'మరో చంటిగాడి ప్రేమకథ' అంటూ 'రోగ్‌' సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు పూరి జగన్నాథ్‌. కన్నడ, తెలుగు భాషల్లో త్వరలో విడుదల కానుంది ఈ చిత్రం. ఇందులో ఇషాన్‌ హీరోగా నటిస్తున్నాడు. హీరోగా అతనికి ఇదే తొలి చిత్రం. పూరి సినిమాల్లో కనిపించే టిపికల్‌ మేనరిజమ్స్‌తోనే ఇందులోనూ ఇషాన్‌ కనిపించబోతున్నాడు. హీరోయిన్లు అయితే కెవ్వు కేక. ఏంజెలా, మనారా సూపర్బ్‌ గ్లామరస్‌గా కనిపిస్తున్నారు. మోషన్‌ పోస్టర్‌తో పూరి ఆల్రెడీ తన మార్క్‌ని ప్రదర్శించాడు. అందులో హీరో ఓ కర్రని పట్టుకుని వేలాడుతోంటే, హీరోయిన్‌ ఆ హీరోని తన రెండు కాళ్ళతో బంధించి పట్టుకుంటుంది. పూరి సినిమాల్లోనే కనిపించే సిగ్నేచర్‌ మూమెంట్స్‌ అవి. ఇవన్నీ చూస్తే 'రోగ్‌' - 'ఇడియట్‌'ని మించి ఉంటుందనే భావన కలుగుతుంది. ఆల్‌ ది బెస్ట్‌ టు ఇషాన్‌.

మరిన్ని సినిమా కబుర్లు
Open letter from LAKSHMI MANCHU on BHAVANA incident telugu n English matter