Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sunil act  different  roal

ఈ సంచికలో >> సినిమా >>

అఘాయిత్యాలకి అదే శిక్ష : రకుల్‌

rakul  serious warning

నటి భావన కిడ్నాప్‌, లైంగిక వేధింపు ఘటనతో యావత్‌ సినీ ప్రపంచం ఉలిక్కి పడింది. ఈ ఘటనకి సంబంధించి మల్లూవుడ్‌ అంతా భావనకు అండగా నిలిచింది. టాలీవుడ్‌, కోలీవుడ్‌ పరిశ్రమ నుంచి కూడా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు సానుభూతి తెలియజేస్తూ బాసటగా నిలిచారు. కోలీవుడ్‌ నుండి హీరో విశాల్‌ కొంచెం ఎక్కువగానే స్పందించాడు. అవసరం అనుకుంటే ఆమె వెంట న్యాయ పోరాటానికి కూడా సిద్ధం అన్నాడు. అలాగే టాలీవుడ్‌ నుండి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా ఇలాగే స్పందించింది.

హీరోయిన్స్‌పై అఘాయిత్యాలంటే చాలా సిగ్గుమాలిన చర్య అంటూ ఘాటుగా స్పందించింది ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఆ స్థానంలో తానుంటే ఆలాంటి వారిని కాల్చి చంపేస్తానంటూ ఆమె తన ఆవేదనని తెలియజేసింది. అలాగే పలువురు తారలు కూడా సానుభూతి తెలిపారు. గతంలో తమిళ్‌ నటి వరలక్ష్మి కూడా ఈ రకంగా లైంగిక వేధింపులకు గురి అయ్యింది. ఆమె ఆషా మాషీ నటి కాదు. తమిళంలో సూపర్‌ స్టార్‌ అయిన శరత్‌ కుమార్‌ కూతురు వరలక్ష్మీ. అంత బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న అలాంటి వారికే ఇలాంటి వేధింపులు తప్పలేదు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి. మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే ఇప్పుడు భావన విషయంలో పట్టుబడ్డ నిందితులకు తగిన శిక్ష విధించాలి. 

మరిన్ని సినిమా కబుర్లు
indrakanti  compleate telugu director