మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో తెరకెక్కిన చిత్రం 'ఖైదీ నెంబర్ 150'. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ జరిగినప్పుడే చాలా మంది యంగ్ హీరోలు, సీనియర్ హీరోలు కూడా చిరు రీ ఎంట్రీకి ఘన స్వాగతం పలికారు. హార్ట్‌ఫుల్‌గా వెల్‌కమ్ చెప్పారు. వీలైతే ఈ సినిమాలో చిరుతో కలసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ అందరికీ ఆ ఛాన్స్ కుదరలేదు. ఒక్క చరణ్ మాత్రమే స్క్రీన్‌పై తండ్రి చిరంజీవితో కలసి డాన్స్‌లేశాడు. అయితే ఆలస్యంగా తెలిసిన విషయం ఏంటంటే, విక్టరీ వెంకటేష్, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇద్దరూ కలిసి చిరంజీవితో స్క్రీన్ మీద కనిపించాలనుకున్నారట. ఇది చిరంజీవికి కూడా తెలియని విషయం,
అసలెవ్వరికీ తెలియని విషయం అంటూ వెంకీ సరదాగా రివీల్ చేశాడు. ఉగాది సందర్భంగా బుల్లితెర మెగా ప్రోగ్రాం 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కి గెస్ట్‌గా విచ్చేశాడు వెంకీ. ఈ సందర్భంగా చిరంజీవితో తన మనసులోని మాటని ఇలా పంచుకున్నారు. అయితే అప్పుడు 'ఖైదీ'కి మిస్సయిన ఛాన్స్‌ని బుల్లితెర ప్రేక్షకుల సాక్షిగా, 'మీలో ఎవరు కోటీశ్వరుడు' స్టేజ్‌పైన చిరంజీవితో డాన్స్ చేసి తీర్చుకున్నాడు వెంకీ. విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ కలిసి బుల్లితెరపై వెంకీ తాజా చిత్రం 'గురు'లోని జింగిడీ.. జింగిడీ.. పాటకి సరదాగా స్టెప్పులేశారు. అభిమానులు ఇలా వీరిద్దరినీ స్క్రీన్‌పై చూసి చాలా ఆనందించారు. ఇప్పుడిలా బుల్లితెరని పంచుకున్న వీరిద్దరూ త్వరలోనే ి బిగ్ స్క్రీన్ పంచుకుంటారేమో చూద్దాం.
|