రాజమౌళి అద్భుత సృష్టి 'బాహుబలి'. ఇప్పటికే 'బాహుబలి ది బిగినింగ్'తో రికార్డులు కొల్లగొట్టేశాడు రాజమౌళి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటోందంటే అది బాహుబలి గొప్పతనమే. రాజమౌళి క్రియేటివిటీనే. ఒప్పుకోక తప్పని సత్యమిది. ఈ సినిమాకి కన్ క్లూజన్ అతి త్వరలోనే విడుదల కానుంది. ఏప్రిల్ 28న 'బాహుబలి కన్‌క్లూజన్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని ఘనంగా నిర్వహించారు హైద్రాబాద్‌లో. ఈ ఫంక్షన్‌కి బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కరణ్ జోహార్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. 'బాహుబలి' సినిమా గురించి, రాజమౌళి గొప్పతనం గురించి ఆయన ప్రశంసించారు. ప్రబాస్, రానా, అనుష్క, తమన్నా తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కింది ఈ చిత్రం.
1000 కోట్ల క్లబ్‌లో ఈ సినిమాను నిలపాలన్నదే చిత్ర యూనిట్ టార్గెట్. వీలైనన్ని ఎక్కువ ధియేటర్స్‌లో ఈ సినిమాని విడుదల చేయనున్నారట. తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుందన్న సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ ఇప్పటికే యూ ట్యూబ్‌లో సంచలనాలకు వేదికైంది. ట్రైలర్‌కి ముందు సినిమాపై ఉన్న అంచనాలు ఒక ఎత్తైతే, ట్రైలర్ వచ్చినాక పెరిగిన అంచనాలు మరో ఎత్తు. ఇంత భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేసేసింది. ఇక ప్రేక్షకుల ముందుకొస్తే ఇంకెన్ని సంచనలనాలకు తెర లేపుతుందో చూడాలి మరి.
|