Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nakshatram movie review

ఈ సంచికలో >> సినిమా >>

గెట్‌ రెడీ ఫర్‌ 'పైసా వసూల్‌'

get ready for paisa vasool

బాలయ్య హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'పైసా వసూల్‌' సినిమా షూటింగ్‌ పూర్తయిన సందర్భంగా గుమ్మడికాయ కొట్టేశారు. ఆగస్ట్‌ 17న ఖమ్మంలో సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ జరగనుంది. ఈ ఫంక్షన్‌ని ఖమ్మంలో నిర్వహించేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే విడుదలైన స్టంపర్‌ దుమ్ము రేపేస్తోంది. సినిమా సెప్టెంబర్‌ 1న విడుదల కానుంది. సినిమా ప్రారంభోత్సవం రోజునే సినిమా రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేశాడు పూరి జగన్నాథ్‌. సెప్టెంబర్‌ 27న విడుదల చేస్తామని చెప్పాడుగానీ, అందరికీ షాక్‌ ఇస్తూ, సెప్టెంబర్‌ 1నే సినిమా విడుదల చేయడం పూరి 'స్పీడ్‌'ని చెప్పకనే చెబుతుంది. పూరి కనెక్ట్స్‌ ద్వారా ఈ సినిమా కోసం నటీనటుల్ని ఎంపిక చేశారు. ముస్కాన్‌ సేథి, శ్రియా శరన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాట్‌ బ్యూటీ కైరా దత్‌ మరో ముఖ్యమైన పాత్రలో కన్పిస్తోంది.

ఈ సినిమా నిర్మాణ పర్యవేక్షణ అంతా ముద్దుగుమ్మ ఛార్మి చూసుకుంటోంది. డ్రగ్స్‌ కేసులో పూరి జగన్నాథ్‌, ఛార్మి విచారణ ఎదుర్కొన్నా ఆ ప్రభావం సినిమాపై కనబడనీయకపోవడం గొప్ప విశేషం. అంతేకాకుండా, అనుకున్న డేట్‌ కన్నా ముందే సినిమాని ప్రేక్షకులకి కానుకగా ఇవ్వడం మరీ విశేషం. బాలయ్య కెరీర్‌లోనే ఇదొక స్పెషల్‌ సినిమా అవుతుందట. గ్యారంటీ సూపర్‌ హిట్‌ అని పూరి జగన్నాథ్‌, అభిమానులకు భరోసా ఇస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే బాలయ్యకు వీరాభిమానినయిపోయానని పూరి అన్నాడు. 

మరిన్ని సినిమా కబుర్లు
mahesh stills with character