Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

నక్షత్రం చిత్రసమీక్ష

nakshatram movie review

చిత్రం: నక్షత్రం 
తారాగణం: సందీప్‌ కిషన్‌, సాయిధరమ్‌ తేజ్‌, రెజినా, ప్రగ్యా జైస్వాల్‌, తనీష్‌, ప్రకాష్‌రాజ్‌ తదితరులు 
సంగీతం: మణిశర్మ, భీమ్స్‌, భరత్‌ మధుసూధన్‌, హరి గౌర 
సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్‌ నరోజ్‌ 
దర్శకత్వం: కృష్ణవంశీ 
నిర్మాతలు: కె.శ్రీనివాసులు, ఎస్‌.వేణుగోపాల్‌, సజ్జు 
నిర్మాణం: బుట్టబొమ్మ క్రియేషన్స్‌, విన్‌ విన్‌ విన్‌ క్రియేషన్స్‌ 
విడుదల తేదీ: 4 ఆగస్ట్‌ 2017

క్లుప్తంగా చెప్పాలంటే 
తాత, తండ్రి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయడంతో తానూ పోలీస్‌ అవ్వాలనే లక్ష్యం పెట్టుకుంటాడు రామారావు (సందీప్‌ కిషన్‌. ఎస్‌ఐ పరీక్షలకు వెళ్ళే క్రమంలో కమిషనర్‌ రామబ్రహ్మం కొడుకు రాహుల్‌ (తనీష్‌)తో గొడవ కారణంగా ఇబ్బందిపడతాడు. ఎస్‌ఐ అవ్వాలన్న కల చెదిరిపోయిందనే ఆందోళనలో ఉన్న రామారావు, తమాయించుకుని పోలీస్‌ అవలేకపోయినా పోలీస్‌లా సమాజానికి రక్షణగా ఉండాలనుకుంటాడు. ఈ క్రమంలో పోలీస్‌ డ్రస్‌ వేసుకుని అనధికారికంగా డ్యూటీ చేస్తాడు. అయితే ఆ డ్రెస్‌ అలెగ్జాండర్‌ (సాయిధరమ్‌తేజ)ది. అలెగ్జాండర్‌ గురించి పోలీస్‌ అధికారి కిరణ్‌రెడ్డి (ప్రగ్యాజైస్వాల్‌), రామారావుని నిలదీస్తుంది. ఆ అలెగ్జాండర్‌ గురించి కమిషనర్‌ వెతుకుతుంటాడు. ఎవరీ అలెగ్జాండర్‌? అతని డ్రస్‌ రామారావు దగ్గరకి ఎలా వచ్చింది? పోలీస్‌ అవ్వాలన్న సందీప్‌ కిషన్‌, పోలీస్‌ అవుతాడా? అలెగ్జాండర్‌కీ కిరణ్‌రెడ్డికీ సంబంధమేంటి? కమిషనర్‌ ఎందుకు అలగ్జాండర్‌ గురించి వెతుకుతుంటాడు? ఇవన్నీ తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే 
పోలీస్‌ అవ్వాలనే పట్టుదల ఉన్న యువకుడి పాత్రలో సందీప్‌ కిషన్‌ చాలా బాగా చేశాడు. ఇదివరకే చాలా సినిమాలతో నటుడిగా సత్తా చాటిన సందీప్‌ కిషన్‌కి, నటుడిగా మరో మెట్టు ఎక్కించే చిత్రమే ఇది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. పాత్రలోని భావోద్వేగాలు అద్భుతంగా ప్రదర్శించాడు. కనిపించింది కాస్సేపే అయినా సాయిధరమ్‌తేజ సినిమాకి బాగా ప్లస్‌ అయ్యాడు. తన పాత్ర వరకూ పూర్తి న్యాయం చేశాడు.

హీరోయిన్లలో ప్రగ్యా జైస్వాల్‌దే కీలక పాత్ర. ఇద్దరు హీరోలకంటే ఈమె పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత దక్కిందనిపిస్తుంది. పవర్‌ఫుల్‌గా అనిపిస్తూనే, గ్లామరస్‌గానూ సత్తా చాటింది ప్రగ్యా జైస్వాల్‌. అందం ప్లస్‌ అభినయంతో మంచి మార్కులు స్కోర్‌ చేసింది. హాట్‌ అప్పీల్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ బ్యూటీ. మరో హీరోయిన్‌ రెజినా ఉన్నంతలో బాగానే చేసింది. గ్లామర్‌ పరంగా చూస్తే మాత్రం ప్రగ్యా జైస్వాల్‌కి గట్టి పోటీ ఇచ్చింది రెజినా.

మిగతా పాత్రధారల్లో ప్రకాష్‌రాజ్‌ బాగా చేశాడు. విలన్‌గా తనీష్‌ ఆకట్టుకుంటాడు. నెగెటివ్‌ పాత్రలు మరిన్ని వస్తే, యంగ్‌ విలన్‌గా తనీష్‌ నిలదొక్కుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హోమ్‌ మినిస్టర్‌ పాత్రలో జేడీ చక్రవర్తి బాగా చేశాడు. మిగిలిన పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర ఓకే అనిపిస్తారు.

కథ పరంగా ఇంట్రెస్టింగ్‌ అనిపించినా, కథనం నెమ్మదించడం కొంత మైనస్‌గా చెప్పుకోవచ్చు. పాత్రల పరిచయానికే ఫస్టాఫ్‌ అంతా అయిపోతుంది. సెకెండాఫ్‌లో అసలు కథ వేగం పుంజుకుంటుంది. డైలాగ్స్‌ బాగున్నాయి. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరం అనిపిస్తుంది. కృష్ణవంశీ సినిమాల్లో సాంకేతిక విభాగానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఆయా విభాగాలపై అతనికి ఉన్న పట్టు కారణంగా, ఔట్‌పుట్‌ బాగా వస్తుంటుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణ. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సూపర్బ్‌. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగున్నాయి.

సాయిధరమ్‌ తేజ పాత్రకి మొదట్లో ఇచ్చిన ఇంపార్టెన్స్‌ దృష్ట్యా, అతని పాత్ర ముగింపుని ఇంకా అద్భుతంగా ఆశించడం మామూలే. ఇక్కడే కొంత నిరాశ కలుగుతుంది. ఫస్టాఫ్‌ని ఇంకాస్త ఎఫెక్టివ్‌గా తీర్చిదిద్ది ఉండాల్సింది. లాజిక్‌కి అందని సన్నివేశాల విషయంలో కృష్ణవంశీ జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. బోల్డంతమంది స్టార్స్‌ సినిమాలో కనిపించిన దరిమిలా ఆయా పాత్రలకు వెయిట్‌ ఇచ్చే విషయంలో కొంత గందరగోళానికి గురైనట్లూ అనిపిస్తుంది. ఓవరాల్‌గా కృష్ణవంశీ అభిమానుల్ని కొంత మేర నిరాశపరుస్తుందని చెప్పక తప్పదు. అయితే స్టార్‌ కాస్టింగ్‌, సినిమాపై క్రియేట్‌ అయిన హైప్‌, హీరోయిన్ల గ్లామర్‌, సాయిధరమ్‌తేజ అప్పీయరెన్స్‌ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే 
నక్షత్రం మరీ వెలిగిపోలేదుగానీ

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5 

మరిన్ని సినిమా కబుర్లు
get ready for paisa vasool