తన బలమేంటో తెలుసుకుని, ఆ దిశగా స్క్రిప్ట్‌లను ఎంచుకోవడం ఏ హీరోకి అయినా సత్ఫలితాలనందిస్తుంది. అక్కినేని హీరో నాగచైతన్య కూడా అదే పని చేస్తున్నాడు. అందుకే సక్సెస్‌ల మీద సక్సెస్‌లు నాగచైతన్య ఖాతాలో పడుతున్నాయి. 'సాహసం శ్వాసగా సాగిపో', 'ప్రేమమ్', 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలతో వరుస సక్సెస్‌లు అందుకున్న నాగచైతన్య 'యుద్ధం శరణం' అనే సినిమా చేస్తున్నాడిప్పుడు. ఇది కూడా డిఫరెంట్ జోనర్ సినిమానే. సినిమా టీజర్ విడుదలైంది.
టీజర్‌తోనే సినిమా ఎంత ప్రత్యేకమైనదో చెప్పేశాడు దర్శకుడు కృష్ణ ఆర్‌వి మరిముత్తు. ఇదొక ఫ్యామిలీ డ్రామా. ఫ్యామిలీని ఆకర్షించే అంశాలతో పాటు, అందులోనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే చాలాకాలం తర్వాత శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నాడు. టీజర్ కేవలం శ్రీకాంత్ కోసమే కట్ చేశారా? అన్నట్టుగా టీజర్‌లో శ్రీకాంత్‌నే ఎక్కువగా చూపించారు. శ్రీకాంత్ చుట్టూనే టీజర్ నడిచింది. ఇకపోతే ఈ సినిమాలో ముద్దుగుమ్మ లావణ్య నాగచైతన్యకి జోడీగా నటిస్తోంది. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మొన్నీ మధ్యనే 'రారండోయ్..తో ప్రేక్షకుల్ని పలకరించిన నాగ చైతన్య నుండి వెంటనే మరో సినిమా వస్తూండడం అక్కినేని అభిమానులు ఆనందించదగ్గ విషయమే. సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొడుతున్న చైతూకి తిరుగే లేదనిపిస్తోంది. గ్యాప్ లేకుండా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఏదేమైనా సినిమా సినిమాకీ కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్న నాగచైతన్యకి హేట్సాఫ్ చెప్పాల్సిందే.
|