సూపర్ స్టార్ మహేష్ నటిస్తోన్న 'స్పైడర్' సినిమా 'గ్లింప్స్' గతంలోనే వచ్చింది. అయితే అందులో ఎలాంటి డైలాగ్స్ లేవు ఓన్లీ ఉష్ అనే యాక్షన్ తప్ప. ఆ నిశ్శబ్దంలోంచే మహేష్ ఇంత శబ్ధాన్ని పుట్టిస్తే, ఇక సూపర్ స్టార్ సౌండ్ చేస్తే ఎలా ఉంటుంది. అదలా ఉంచితే టీజర్ కంటే ముందుగా ఆడియో సింగిల్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అలాగే సెకండ్ టైమ్ రిలీజ్ చేసిన మహేష్ లుక్‌కి అభిమానులు పండగ చేసేసుకుంటున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. 'స్పై' కాప్‌గా నటిస్తున్నాడు మహేష్, ఈ సినిమాలో. ఆ పాత్ర కోసం మహేష్ చాలా కసరత్తులే చేసినట్లు, స్టిల్స్‌ని చూస్తేనే అర్థమవుతుంది. జేమ్స్‌బాండ్ తరహా పాత్రని తెలుగు తెరపై ఈ చిత్రంలో చూడబోతున్నాం
టెక్నికల్‌గా ఇండియన్ సినిమా స్క్రీన్‌పై న భూతో న భవిష్యతి అనే స్థాయిలో ఉంటుందట. మురుగదాస్ సినిమాలో హీరో చాలా ఇంటెలిజెంట్‌గా కనిపిస్తాడు. అలాగే మహేష్ స్టిల్స్ క్యారెక్టర్ కనిపిస్తోంది. సినిమాకి సంబంధించి ఏ విషయం బయటికి రాకుండా, చాలా రోజులు గోప్యంగా ఉంచారు. కానీ ఒన్స్ టీజర్ విడుదలయ్యాక స్టార్ట్ అయ్యింది మేనియా. ఆగనే ఆగడం లేదు. వచ్చిన ప్రతీ స్టిల్ అదరగొట్టేస్తోంది. విజయదశమి కానుకగా 'స్పైడర్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎస్.జె. సూర్య ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. అతని పాత్రని ప్రత్యేకంగా డిజైన్ చేశాడట దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది ఈ సినిమా.
|