Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

13-10-2016 నుండి 19-10-2016 వరకు వారఫలాలు - - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తం మీద తొందరపాటు నిర్ణయాలు చేయకపోవడం సూచన. పెద్దలతో కలిసి చేసే పనులను కాస్త జాగ్రత్తగా పరిశీలనతో చేయుట మేలు. నూతన ఉద్యోగఅవకాశాలు కలవు, వాటని అందిపుచ్చుకొనే దిశలో ముందుకువెళ్ళుటకు అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనలు మేర జముడనుకు వెళ్ళండి. వ్యాపారపరమైన విషయాల్లో కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. బంధువులతో తమ ఆలోచనలను పంచుకొనే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో భాద్యతలు పెరుగుటకు అవకాశం ఉంది. సంతానం విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబసభ్యుల నుండి సహకారం లభిస్తుంది.

 

 

 వృషభ రాశి :  ఈవారం మొత్తం మీద పెద్దలతో చర్చలు చేయుటకు అవకాశం కలదు. ఆరంభంలో ఇబ్బందులు తప్పక పోవచ్చును. ఓపిక అన్నివిధాలా మేలుచేస్తుంది. సంతానం విషయంలో కొంత ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. మీకంటూ ఒక విధానం ఉండుట చేత మరింత మంచి ఫలితాలు వస్తాయి. సోదరులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. కొంత ఒత్తిడిని పొందుతారు. కొన్ని కొన్ని విషయాల్లో ఆలోచనల వలన సతమతమయ్యే అవకాశం ఉంది.  జీవితభాగస్వామితో సర్దుబాటు విధానం కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది.


మిథున రాశి :  ఈవారం మొత్తం మీద నూతన వాహనములను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. గతంలో తీసుకున్న నిర్ణయాలు కీలకమైన మార్పులకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే ఆస్కారం కలదు. మిత్రులనుండి పూర్తిస్థాయి సహకారం లభిస్తుంది. మీ మాటతీరు మూలాన నూతన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది.  మిత్రులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది, ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. సోదరులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. నూతన అవకాశాలు లభిస్తాయి.

 

 



కర్కాటక రాశి : ఈవారం మొత్తం మీద పత్రిసంభందమైన విషయాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశము ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో దూరప్రదేశంలో ఉన్న మిత్రులనుండి సహకారం లభిస్తుంది. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. స్త్రీ పరమైన విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటె అంత మంచిది. సాధ్యమైనంత వరకు వివాదస్పద విషయాలకు దూరంగా ఉండుట మేలు.  పెద్దలతో పరిచయాలకు ప్రాముఖ్యం ఇస్తారు. రావాల్సిన ధనం సమయానికి అందుతుంది. బంధువులతో కలిసి నూతన్ ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. సమయాన్ని అధికంగా ఆర్థికపరమైన విషయాలకు కేటయిస్తారు. వ్యాపారంలో కొంత ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు.  

 



 సింహ రాశి : ఈవారం మొత్తం మీద నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు శ్రమించాల్సి వస్తుంది. అధికారులతో స్వల్ప మనస్పర్థలు తప్పక పోవచ్చును. విదేశీ లేదా దూరప్రదేశ ప్రయాణాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. రాజకీయపరమైన విషయాల్లో కొంత సందిగ్దత ఉంటుంది. గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆలోచనలను లేదా నిర్ణయాలను స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేయుట మంచిది. జీవితభాగస్వామితో సర్దుబాటు అవసరం. నూతన వాహనముల కోసం ధనం ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి.

 

 


కన్యా రాశి :  ఈవారం మొత్తం మీద మిత్రులను కలుస్తారు,  నూతన పరిచయాలకు అవకాశం ఉంది. సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. కుటుంబసభ్యులతో కలిసి ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. గతంలో మీకున్న పరిచయాలు మీకు ఉపయోగపడుతాయి. సోదరులతో కలిసి చర్చలు చేయుటకు అవకాశం ఉంది. నూతన నిర్ణయానికి వస్తారు. అధికారులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది.  మిత్రులతో సమయం గడుపుతారు. వ్యక్తిగత శ్రద్దపెంచుకొనే ప్రయత్నం చేయుట మంచిది. కోపాన్ని తగ్గిసిన్చుకోవడం వలన లబ్దిని పొందుతారు.

 

 


తులా రాశి : ఈవారం మొత్తం మీద కొంత పనిఒత్తిడిని పొందుతారు. చేపట్టిన పనులను పూర్తిచేసే విషయంలో కాస్త ప్రణాళిక అవసరం. కుటుంబపరమైన విషయాల్లో మీకంటూ ఒక విధానం స్పష్టంగా లేకపోతే ఇబ్బందులు పొందుతారు. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి. మీ మాట వలెనే చాలా పనులు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, తగ్గించుకొనే ప్రయత్నంలో విఫలం అవుతారు. బంధువులనుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ద తీసుకోండి. మొండి నిర్ణయాలు తీసుకోవడం వలన లబ్దిని పొందుతారు.  శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి.

 

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు. చేపట్టిన పనులకు నలుగురిలో గుర్తింపును పొందుతారు. మానసికంగా కొంత మిత్రుల వలన ఒత్తడిని పొందుతారు. చిన్న చిన్న విషయాలకే కొంత నిరాశను పొందుటకు అవకాశం ఉంది. వ్యాపారంలో అనుభవజ్ఞులతో కలిసి ముందుకు వెళ్ళుట సూచన. ఉద్యోగంలో అందరి నుండి సంతృప్తి కరమైన సహకారం లభిస్తుంది. కుటుంబంలో నిర్ణయాలు తీసుకొనే ముందు అందరి ఆలోచనలను పరిగణలోకి తీసుకోండి. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. నలుగురిని కలుపుకొని వెళ్ళుట సూచన. పెద్దలతో తమఆలోచనలను పంచుకుంటారు. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది.

 

 

ధనస్సు రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో నలుగురిని ఆకట్టుకోగలుగుతారు. మీ ఆలోచనలను అందరు అంగీకరికిన్చే అవకాశం ఉంది కావున కాస్త శ్రమించుట ద్వారా మరింత ఉన్నతమైన ఫలితాలు పొందుటకు ఆస్కారం ఉంది. తల్లితండ్రులతో సమయాన్ని గడుపుతారు, మీ ఆలోచనలను పంచుకుంటారు. విదేశీప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది.దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. నూతన పరిచయాలకు అవకాశం కలదు. ఊహించని ఖర్చులను పొందుతారు. వాహనముల విషయంలో జాగ్రత్త అవసరం.   పెద్దలతో సంభందాలు పాడవకుండా జాగ్రత్త పడటం అవసరం. ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని కొంత బాధిస్తాయి జాగ్రత్త.



మకర రాశి : ఈవారం మొత్తం మీద చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. గతంలో మొదలుపెట్టిన పనులను ముందుగా పూర్తిచేసే ప్రయత్నం చేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో మీకంటూ ఒక విధానం కలిగి ఉండుట సూచన. బంధువులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయపరమైన రంగాల్లో ఉన్నవారికి సంతృప్తినిచ్చే వార్తలు వైన్ ఆస్కారం ఉంది. పెద్దలనుండి గుర్తింపును పొందుతారు. అధికారులతో కలిసి నూతన ప్రూయత్నాలు మొదలు పెడతారు. విదేశీప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది.మిత్రులతో సమాయన్ని సరదాగా గడుపుతారు. దూరప్రదేశంలో ఉన్న బంధువులను కలుస్తారు.

 


కుంభ రాశి : ఈవారం మొత్తం మీద జాగ్రత్తగా ఉండవలిసిన సమయం. ఆత్మీయులతో విభేదాలు వచ్చే అవకాశం కలదు జాగ్రత్త. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది. దూరప్రదేశ ప్రయాణాలు వాయిదావేయుట సూచన. నలుగురిలో ఉన్నప్పుడు వారికి అనుగుణంగా నడుచుకునే ప్రయత్నం చేయుట సూచన. బంధువులతో చర్చలకు అవకాశం ఇవ్వకంది. నూతన పనులను మొదలు పెట్టుటకు మంచిసమయం. ఉద్యోగంలో మార్పులకు అవకాశం కలదు. జీవితభాగస్స్వామితో కలిసి ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. నూతన వ్యాపారాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. మిత్రులతో కలిసి నూతన పనులను ఆరంభిస్తారు.

 

మీన రాశి : ఈవారం మొత్తం మీద పెద్దలతో కలిసి నూతన పనులను మొదలు పెట్టుటకు అవకాశము ఉంది. ఆర్థికపరమైన విషయంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. గతంలో చేపట్టిన పనులకు గాను నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. దూరప్రదేశప్రయాణాలు చెయుటకు అవకాశం కలదు. కుటుంబపరమైన విషయాల్లో మీ ఆలోచనలను పెద్దలకి తెలియజేస్తారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది.  ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి నూతన పర్యటనలు చేయుటకు అవకాశం ఉంది.  పెద్దలతో  సమయం గడుపుతారు. అనుభవజ్ఞుల సూచనలు మీకు ఉపయోగపడుతాయి. మీ ఆలోచనల చేత నలుగురిలో గుర్తింపును పొందుతారు.

మరిన్ని శీర్షికలు
bamboo chiken