పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'అజ్ఞాతవాసి' టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమాతో యంగ్ అండ్ డైనమిక్ అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తమిళంలో మనోడు ఇప్పటికే తన టాలెంట్‌ని చూపించేశాడు. 'వై దిస్ కొలవెరీ..కొలవెరీ ఢీ' అనే పాటతో యూత్‌ని ఓ ఊపు ఊపేశాడీ తమిళ బుల్లోడు. తమిళ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన 'త్రీ' సినిమాలోనిదీ సాంగ్. తమిళ సినిమా సాంగ్ అయినప్పటికీ, యూనివర్సల్ సాంగ్‌గా అలరించేసింది. ఈ పాటకి యూత్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అయితే ఇన్నాళ్లకి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు అనిరుధ్. లేటుగా అయినా లేటెస్టుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పాడు ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్.
పవన్ సినిమాలో ఈ బుల్లోడు కంపోజ్ చేస్తున్న ఆడియో నుండి ఒక్క బిట్ సాంగ్ బయటికి వదిలారు అంతే. ఆ జస్ట్ బిట్ సాంగ్‌తోనే మనోడు ఊపు ఊపేస్తున్నాడు. ఇక టోటల్‌గా సినిమాలోని ఆడియో ఎలా ఉండబోతోందో ఈ బిట్ సాంగ్ వింటేనే తెలిసిపోతోంది. ఇదిలా ఉండగా, అప్పుడే మనోడికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. త్రివిక్రమ్ ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాకీ అనిరుధ్‌నే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిక్స్ చేసేశాడనీ సమాచారమ్. అంటే ఎంట్రీతోనే స్టార్ హీరోల సినిమాలకి మ్యూజిక్ ఇచ్చే బంపర్ ఛాన్సెస్ కొల్లగొట్టేస్తున్నాడు కొలవెర్రి బుల్లోడు. ఇంకా ఆడియో మార్కెట్‌లోకి రాకుండానే మనోడికి డిమాండ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది మరి. ఇక పవన్ సినిమా ఆడియో బయటికి వస్తే వచ్చే కిక్కు ఎలా ఉండబోతోందో చూడాలిక.
|