ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'పి.ఎస్.వి.గరుడవేగ 126.18'. రాజశేఖర్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజయ్యింది. ట్రైలర్ వచ్చాక సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. ట్రైలర్‌లో యాక్షన్ సీన్స్‌ని కట్ చేసిన విధానం చాలా బాగుంది. టెక్నికల్‌గా ట్రైలర్ చాలా బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. 'గుంటూరు టాకీస్', చందమామ కథలు వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. జాతీయ అవార్డు గ్రహీత కూడా. రాజశేఖర్ వంటి హీరోతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కిస్తూ, టెక్నికల్ వేల్యూస్‌పై ఎక్కువ కాన్‌సన్‌ట్రేషన్ చేశాడు. ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్ అనిపిస్తోంది.
దాంతో ట్రైలర్ కట్ చేసిన విధానమే ఇంత బాగుంటే, ఇక సినిమా ఇంకెంతగా ఆకట్టుకుంటుందోనని అంచనా వేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌ని ట్రైలర్‌లో బాగా చూపించారు. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌కి కొత్త అనుభూతిని పొందుతారట ఆడియన్స్. మరో పక్క ఈ సినిమా ట్రైలర్‌ని బాలయ్య చేతుల మీదుగా విడుదల చేయడంతో మరీ క్రేజ్ పెరిగింది. పూజా కుమార్ హీరోయిన్‌గా నటిస్తోంది. సన్నీలియోన్ ఐటెం సాంగ్‌లో నటిస్తోంది. ఈ పాట సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ కానుంది. చాలా గ్యాప్ తర్వాత రాజశేఖర్ చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో రాజశేఖర్ మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేలానే ఉన్నాడు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో రాజశేఖర్ నటిస్తున్నాడు. అన్నట్లు రాజశేఖర్‌కి బాలయ్య సినిమాలో విలన్‌గా నటించాలనే కోరిక ఉందట. ఆ కోరికను తాజాగా ఆయన బయట పెట్టారు. ఏమో బాలయ్య రాజశేఖర్‌కి ఆ ఛాన్స్ ఇస్తారేమో చూడాలి మరి.
|