Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope october 20th to october 26th

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆలయాల నిలయం - ఆదూరి.హైమావతి

temples home

కర్ణాటక రాజధాని  బెంగుళూరు 

భారతదేశంలోనే  ఒక గొప్ప '  ఆలయాలనిలయంగా '   పేరుగాంచింది. ఎంతో ఆహ్లాద కరమైన ప్రకృతి, వాతావరణం , కలిగిన బెంగుళూరు లోని దేవాలయాలను , ప్రకృతిలోని వింతలను , సుందర దృశ్యా లను  వీక్షించను  ప్రపంచంలోని ఎన్నోప్రదేశాలనుండి జనం వస్తుంటారు.బెంగుళూరు  లోని ఆలయాల ,శిల్పసంపద   పురాతన భారతీయ సంస్కృ తి ని  , ఆధ్యాత్మికతను , ఆదర్శవంతమైన చరిత్రను చాటిచె ప్తుండటం విశేషం. ఈ పురా త న ఆలయాలలోని రాతిస్థంభాలలో చెక్కిన నగిషీలు , గోడలపైచెక్కిన అద్భుత దృశ్య ములు , సుందరమైన బొమ్మలు,  మరెచ్చటనూ కాంచలేని శోభాయమానము లై న  ద్వారములు , సందర్శకుల మనస్సులను దోచుకుంటాయి. బెంగుళూరులో ని  అత్యధిక  దేవాలయాలు విష్ణుమూర్తి , ఈశ్వరునిఆలయాలే!

1.  శ్రీవెంకటేశ్వర ఆలయం---' 

 బెంగుళూరులోని'  శ్రీవెంకటేశ్వర ఆలయం ' 300సం.క్రితం ' మహారాజ చిక్కదేవరాయ వడయారు 'చే నిరింపబడినది.ఈ ఆలయంలో వెల్లి విరిసే ద్రవిడ శిల్ప సంపద చూపరుల హృదయాలను పరవసింపజేస్తుంది. రాతిస్థంభాలలో చెక్కిన సున్నితమైన బొమ్మలు, రాతి సిం హాలు సజీవంగా ఉన్న అనుభూతునికల్గిస్తాయి.భారతీయ సంస్కృతీ వైభవాన్ని కన్నులకు కట్టే ఈ ఆలయంతీరు సుదూరప్రాంతాల భక్తులనందరినీ ఆకర్షిస్తున్నది. టిప్పుసుల్తాన్ వేసవి విడిదికి దగ్గరగా ఉన్న ఈ ఆలయ మటపంలోని స్థంభాలు  ,సింహా లు  వీపుపై మోస్తున్న విధంగాను గోడలు జంతువుల, మానవుల రూపాలు వివిధ భంగిమలలోను, బ్రహ్ర  , విష్ణు  , ఈశ్వరుల చిత్రాలు చెక్కబడి ఉండటం విశేషం. ఆలయం మరీ పెద్దదికాకున్నా , చరిత్ర ప్రసిధ్ధి గాం చినది.3వ మైసూరు యుధ్ధ సమ యంలో  1791-92 లో ఫిరంగి తూటాలకు రంధ్రాలు పడిన స్థంభాలను సైతం మనం చూడవచ్చు.కొతవరకూ ధ్వంసమై న  ఆ స్థంభాలను , మహారాజు చిక్క కృష్ణ దేవరాయ లు 1811లో పూర్వ స్థితికితెచ్చేదుకు ఎంతో కృషి చేశాడు. బెంగుళూరులోని ఈ పురాత న ఆలయ శిల్పసంపదను వీక్షించను ఎంతోమంది భక్తులు చరిత్రకారులు వస్తుంటారు.  

'2. ధర్మరాజు ' ఆలయం;-

మరొక అత్యద్భుతమైనశిల్పసంపదతో  కనువిందు చేసే ఆలయం ' ధర్మరాజు ' ఆల యం.  పాండవా గ్రజుడైన ధర్మరాజు ఆలయం చాలా అరుదుగా ఉంటుంది. ఆలాంటి ఆలయంకూడామనం బెంగుళూరులో వీక్షించవచ్చు. ఈ ' ధర్మరాజు ' ఆలయంలో , ' శ్రీకృష్ణుని ' మూలవిరాట్టును  గర్భాలయంలో చూడ వచ్చు.  ఆలయం బయట, లోపల రంగుల శిల్పకళ భక్తుల హృదయాలను అలరిస్తుంది . ' ద్రౌపదిని ' ప్రకృతి మాతగా , దేవతగా కొలుస్తారు. కరగను ' ద్రౌపదికి ' ప్రతి రూపం గా  భావిస్తారు.మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో తెల్లవారుఝామున రెండుగంటలకు ఉత్సవ విగహాలను అర్చించి ఊరేగింపు మొదలై ఉదయం 6గంటలకు  ఆలయాన్ని చేరుతుంది. ఊరేగింపులో  భక్తులందరూ అత్యుత్సాహంగా పాల్గొం టారు ఊత్సవవిగ్రహాలను మాత్రం  అగ్నికులక్షత్రియులే పల్లకి లో మోసుకు వెళతారు.  ధోవతులు   , మెడలో పులమాలలు ధరించి , తలపై రంగుల పాగాతో ,' వీరకుమారులు '  అనిపిలువబడేవీరు , చేతుల్లో పొడవాటిఖడ్గాలతో ఊరేగిం పులో పాల్గొంటారు.  ఎంపికచేయబడిన ఒకరు తలపై నీటితో ఉండే ' కళశాన్ని'  పూలతో అలంకరించి ధరించి మోస్తూ ఉండగా అందరూ మేళతాళాలతో , డప్పులతో , జండా లతో, కాగడాలతో వెంట  ఊరేగింపుగా  రాత్రంతాతిరిగి , హారతులు అందుకుని తెల్లవారి ' ధర్మరాజు ' ఆలయాన్ని చేరుతారు.ఖడ్గాలు ధరించిన వీరకుమారులు కలశం మోసు కొస్తున్న వ్యక్తి చుట్టూ ఉండి జాగ్రత్తగా పరిశీలిస్తుంటరు. ఏ కారణం చేతనైనా అతడు కలశా న్ని క్రిందపడవేస్తే అతడి తలనరికేయ బడు తుంది.అది ఈ ఊరేగింపు లో ప్రత్యేకత. ఎందరో ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొంటారు.దేవుని పట్ల భయ భక్తులతో  అమిత జాగ్రత్తగామసలాలని ఈనియమంకావచ్చు.   రాత్రంతా అక్కడచేరిన భక్తులందరికీ , భోజనాలు పెడతారు , ఎంతోమందికి బియ్యం ఇస్తారు, ఈ ఉత్సవస మ యం లో అన్న దానాలు, పేదల కు దానధర్మాలు జరుగుతాయి. రాత్రంతా ఆలయంలో భజనలు , నాట కాలు నిర్వహిస్తారు. ఊరేగింపు ముస్లిముల దర్గాలవద్ద ఆగి వారినికలుపుకుని ఆలయా నికి సాగుతుంది. ఈవిధంగా అన్ని మతాల ఐకమత్యానికి సంకేతంగా ఈ ఉత్సవం తర తరాలు గా అగ్నికుల క్షత్రియులు జరపడం ఆనవాయితీ గా వస్తునది.ఈ 'కరగోత్సవం '  బెంగుళూరు లోని ధర్మరాజ ఆలయంలో ఏటేటా జరిగే ఓగొప్ప పండుగ   . 

3.. కెంప్ ఫోర్ట్  ' పరమ శివుని ' విగ్రహం బెంగుళూరులో చూడతగిన మరొక మనో హర ప్రదేశం . శివుడు  దుష్ట శక్తులను దునుమాడే రుద్రుడని  పేరుగాంచినందున బెంగు ళూరు మహానగరం లోని ' దుష్టశక్తులను నిర్దేశిoచనేమో అన్నట్లు ' శివాలయాల నిల యంగా' ఉంది.అత్యాధునిక మహానగరం బెంగుళూరులోని  పాతవిమానాశయ ప్రాంతం లోని , పూర్వం కెంప్ ఫోర్ట్ గా పిలువబడిన ప్రదేశం లోని ' 65 అడుగుల ఎత్తైన  ధ్యాన మూర్తిగాఉన్న తెల్లని ' పరమ శివుని ' విగ్రహం.

హిమాలయాలపై పద్మాసనంలో కూర్చుని ఉన్న అర్ధనిమీలిత నేత్రాలతో ఉన్న శివుని చూస్తుంటే మనం ప్రత్యక్షపరమేశుని చూస్తున్న అనుభూతి కలిగి హృదయాలు పరవసి స్తాయి.నాల్గుహస్తాలలో రెండు హస్తా లు ధ్యానముద్రతోను  ,మిగిలినరెండుహస్తాలు ఢమరుకం , త్రిశూలం ధరించి ఉండి, కైలాసశిఖరంపై ఉన్న శివుని తలపైనుండీ గంగా మాత స్వచ్చమైన జలాన్ని కురిపిస్తున్నట్లుండే దృశ్యం హృదయాలను పరవ శింపజే స్తుంది.శివుని ముందున్న చిన్న సరస్సు ' కోర్కెలు తీర్చేసరస్సుగా పిలుస్తారు,భక్తులు ' శివుని ' ధ్యానిస్తూ ' ఓం నమశ్శివాయ  ' అని 7 మార్లు జపించి ఒకనాణాన్ని సరస్సు లోకి విసిరితే వారుకోరిన కోర్కెలు తీరుతాయని భక్తులవిశ్వాసం. ఆసరస్సులో చిన్న దీపాలువెలిగించి వదులుతుంటారు. శివునికి  ఎడమవైపునుండీ గుహలానిర్మించిన ప్రదేశంలో  ప్రవేశించి ద్వాదశజ్యోతిర్లింగాలను మనం దర్శించుకుంటాం.కుడివైపునుండీ బయటకు వస్తూ ' పార్వతీ ' అమ్మవారిని దర్శించుకుంటాం.ఈలోపల అడుగు పెట్టేప్పుడే ముందుగా' గణపతిని కొలిచి , మొక్కి  లోనికి ప్రవేశించవలసి వుం టుంది.  సాయం కాలం భక్తులతో నిత్యo కిటకిటలాడే ఈ శివుని సన్నిధి బెంగుళూరులో చూడవసిన ఆధ్యాత్మిక ప్రదేశం. 

4. ' బుల్ టెంపుల్ లేక నంది ఆలయం ' గాపిలువబడే ' శివుని వాహనం ' నంది ' ఆలయం చాలా పురాతన మైనది, బసవన్న గుడి ప్రాంతంలోని కొండపైన  ఈ ఆలయా న్ని ' కెంపేగౌడ 16 వ శతాభ్దిలో  , ద్రవిడ శిల్పసంప్రదాయం ప్రకారం  నిర్మింప జేశాడు. ఆలయ కధనంప్రకారం ,ఒకానొక సమయంలో   ఒక పెద్ద ఆబోతు ఎద్దు , రైతుల వేరు శనగ పంటను ప్రతి రోజూ నాశనంచేస్తున్నం దున , ఒకరైతు  కోపంతో దాన్ని   ఒక పెద్ద దుడ్డుకర్రతో కొట్టగా  అది రాతి ఎద్దుగా మారి పోయిందిట!  రైతు లంతా ఎంతోబాధపడి అక్కడ ఆఎద్దుకు ఆలయం నిర్మింపజేశారు , అదే నేడు మనం ' బుల్ టెంపుల్ ' గా పిలుస్తున్న   ' నందీశ్వరాలయం.' ఈ నంది విగ్రహం పెరుగు తూ ఉన్నందున దాని నుదుటి మీద ఒక త్రిశూలాన్ని ముద్రించారు.రైతులు ప్రతి ఏటా వారి మొదటి పంటను ' నందీశ్వరాలయానికి కానుకగా ఇవ్వడం అనవాయితీగావస్తున్నది.ప్రతి సంవత్సరం' ఈ నందీశ్వరాలయం వద్ద ' వేరుశనగ ' సంత జరగడం విశేషం.ఈ నంది విగ్రహం 4.5 మీ [15 అడుగుల ] ఎత్తుగాను, 6మీటర్ల  [ 20 అ.]పొడవుగా ను ఉండి సజీవం గావున్న అనుభూతిని చూపరులకు కల్గిస్తుంది.ఈ నంది కొండక్రింద దొడ్డ గణపతి ఆలయాన్ని మనం వీక్షించవచ్చు.ఈ గణపతి విగ్రహమూర్తి 10అ.ఎత్తుగాను 15 అ. వెడల్పుగాను ఉండి భక్తులకోర్కెలు తీర్చేందుకు తయారుగా అభయహస్తంతో ఉండి చూపరుల మన స్సు లను దోచు కుంటుం ది.ఈ దొడ్డగణపతి ఆలయానికి కొంచెంపైగా ఆయన పిత్రు దేవులైన  ' పరమశివుని ఆలయమూ మనం వీక్షించి తరించవచ్చు. 

5.గంగాధరేశ్వర గుహాలయం:--పూలతోటల నగరంగాపేరుగాంచిన బెంగుళూరు నిజానికి ఆలయాలనగరం అనేవిషయం ఇక్కడి ఆలయాలు వీక్షించే భక్తులహృదయా లకు స్పస్టమవుతుంది .ముఖ్యంగా ఇక్కడి ' గంగాధరేశ్వర ' గుహాలయం , 'గవిపురం ' అనే చిన టౌన్లో ఉన్నందున , ' గవి గంగాధరేశ్వరాలయం ' అనేపేర ప్రసిధ్ధిగాంచింది. ఈ ఆలయం ఒకే నల్లరాతి తో చెక్కిన అత్యధ్భుత శిల్ప కళాఖండం. వాస్తుకళ , ఖగోళ శాస్త్రా లసమ్మిళిత రూపమైన ఈ ఆలయం 9వ .శ.లో బెంగుళూరి నగరాన్ని నిర్మించిన ' కెంపే గౌడ ' ప్రభువుచేనిర్మితమైనది.ఈ ఆలయ మంటపం నాల్గు శిలా స్థంభాల పై  నిర్మితమై ఉండటం  ,అవి శివుని చిహ్నాలైన ' త్రిశూలం, ఢమరుకం ,శూర్య పన, చంద్రపనలతో   , కూర్చున్న నంది ఆకారంలో ఉన్న నాల్గు స్తంభాలూ   2మీ వ్యాసంతో  అద్భుత శిల్పకళతో కనువిందు చేస్తాయి.  ఇక్కడ ' అగ్ని దేవుని ' రూపం అత్యద్భుతంగా ఉంటుంది.ఆలయంలో ఎడమవైపు భక్తులను ఆకట్టుకునే రూపం 12 చేతులతో అలరించే గణేశుని విగ్రహమూర్తి.ఈ ఆలయంలో ని ఖగోళ వింతను వీక్షించను , మకర సంక్రాంతి రోజున భక్తులు పోటెత్తుతారు.ఘుహలో ఉన్న 'శివలింగంపై ' ప్రసరించే సూర్య కిరణాలు భక్తుల ఆకర్షణకు నిలయాలు.ఈ ఖగోళశాస్త్రవింతను పరిశీలించను శాస్త్రఙ్ఞులు ప్రతి సం వత్సరం జనవరి 13నుండి 16వ తేది వరకు ; జులై 16నుండి 26 వరకు ఈ ఆలయానికి వస్తుంటారు. 

సూర్యా స్తమయ సమయంలో  ,నైఋతీ  దిక్కునుండి గుహకు ఉన్న రెండు నిలువు కిటికీలద్వారా , సూర్య కిరణాలు ప్రసరించి , నంది రెండు కొమ్ముల మధ్యనుండీ పయ నించి ,గుహలోపలి మూలవిరాట్టైన ' శివలింగంపై 4.55 నుండి 5.10 గంటల వరకు 15.ని.పాటు ప్రసరించడం చిత్రాతిచిత్రం.  దినరాజైన సూర్యదేవుడు , శివునిపాదాలకు తన నమస్కృతులను   అందిస్తున్నట్లుండే ఈ అద్భుత దృశ్యం మన పూర్వ  భారతీయ శిల్పుల మేధను , కళ్ళకు కట్టడం చూసి తరించవలసిందేకాని , వర్ణించవీలుకాదు.  

6.ఇస్కాన్ రాధాకృష్ణ ఆలయం:-బెంగుళూర్ జయనగర్ లో హరేకృష్ణ కొండపై వెలసి ఉన్న ' రాధాకృష్ణ చంద్ర ఆలయం' ప్రతిరోజూ భక్తులతో కిటకిటలాడుతుంటుంది .  జనం మానసికవిశ్రాంతికైఈ అలయానికి వస్తుంటారు. 7ఎకరాల కొండప్రాంతలో ' ఇస్కాన్ ' గ్రూపు వారు ఈ ఆలయాన్ని అప్పట్లో 11లక్షల తో నిర్మించారు. ఈ ఆలయం లో మనం  నవీన , ప్రాచీన  శిల్పకళల మిశ్రమం.నాల్గు గోపురాలు బంగారు పూత తో  వున్న శిఖరం మీది కలశం  షుమారు 1.5 టన్నుల బరువుతో ఉంది.56అడుగుల ఎత్తైన ధ్వజ స్థంభం కనువిందు చేస్తుంది. ఆలయంలో కృష్ణ , బలరామ , గౌరాంగ మూర్తులను చూడ వచ్చు. ప్రశాంతంగా ' ధ్యానం' చేసుకునే  భక్తులకు  అనువైన పవిత్ర ప్రదేశం ఇది.6నుండి8 వేల మంది భక్తులు  ప్రతిరోజూ సందర్శించే ఈ ఆలయంలో ప్రతి ఒక్కరికీ రోజంతా ప్రసాదాన్ని ఆలయ కార్యకర్తలు అందించడం విశేషం.  

 

  7.సోమేశ్వరాలయం:-అల్సూరు లోని పురాతన సోమేశ్వరాలయం చోళరాజుల కాలంలో  ఆనాటి ప్రాచీన శిల్పకళతో , కెంపెగౌడ చే నిర్మింపబడినది. విశాలమైన మటపం , శిల్పకళ ఉట్టిపడే  అనేక స్థభా లను మనంచూడ వచ్చు.వీటిని మీటిన పుడు  సంగీత ధ్వనులు వినిపించడం  సందర్శకుల మనస్సులను మురిపిస్తుంది. ఆలయ గోడలు , స్థంభాలు ,రాజ గోపురం , ధ్వజస్థంభం తప్పక చూడదగిన అద్భుత దృశ్యాలు.ఇది ఈశ్వరాలయం ఐనా బ్రహ్మ, విష్ణు మూర్తులను ఇక్కడ ఆరాధించడం  ఈ ఆలయ ప్రత్యే కత. కామాక్షీతాయి ,అరుణాచలేశ్వర ,భీమేశ్వర , నంజుండేశ్వర ,పంచ లింగేశ్వరు లను  ప్రత్యేక  గర్భాల యాలతో  కూడి ఉన్న పెద్ద ఆలయం ఇది. శివరాత్రి పర్వదినాన ' పంచలింగేశ్వరు ' నికి అభిషేకాలు చేయను భక్తులు  అత్యధిక సంఖ్యలో విచ్చేస్తుంటారు.   
 

 8. వైట్ ఫీల్డ్ బృందావనం :--ప్రపంచంలోనే ప్రముఖ అధ్యాత్మిక గురుదేవులైన ' శ్రీసత్య సాయి బాబావారి ' ఆశ్రమం , ' బృందావనం ' , బెంగుళూరు కాడుగోడి వైట్ ఫీల్డు  లోని ఆధ్యాత్మిక కేంద్రం మరొక ముఖ్యమైన దర్శనీయ ప్రదేశం .భ్గవాన్ సత్య సాయి బాబా వారు ' మానవసేవే ధ్యేయం  గా, ఉచిత విద్యా లయమైన కళాశాల ,ఉచిత వైద్య శాల ఐన ' సూపర్ స్పెషాలిటీ హాస్పెటల్ ' , వృధ్ధాశ్రమం  , మనశ్శాంతి ని ప్రసాదించే ఆధ్యాత్మిక కేంద్రం , బాబావారు చేసే మానవసేవకు ప్రతి రూపాలు.విద్య , వైద్య ,ఆధ్యాత్మి కత లను విశ్వమానవాళికి అందించే విశ్వగురుదేవులు  , దైవస్వరూలుపులు సంవత్స రంలో కొంత కాలం  వేసవిలో నిబసించే  ఆశ్రమమే బృందావనం .నగరసంకీర్తనలు, ఉద యాస్తమయాలలో భజనలు, 

ఆధ్యాత్మికోపన్యాసాలు , మానవులకు నిత్య దైనందిక శ్రమనుండి ఓదార్పుకలిగించి

మనస్సులను శాంత పరచే  దివ్యప్రదేశమే బృందావనం. ఇచ్చటి ' స్సయి రమేష్ ' హాల్ ముందు తూర్పు ముఖంగా ఉన్న ' సరస్వతీ దేవి ' విగ్రహం , అడిగిన వెంటనే విఙ్ఞానాన్ని అందిస్తుందా అన్నట్లు భక్తుల హృదయాలను ఒక్క దర్శనం తోనే ఆకట్టు కుంటుంది అమ్మరూపం.    జీవితంలో ఒక్కమారైనా ఈ ఆలయాలను దర్శించి జన్మ సార్ధకం చేసుకోవాల్సి ఉంది.

మరిన్ని శీర్షికలు
chamatkaram