Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

బాలయ్య 'సింహా'కే సై అన్నారు?

balayya in  jai simha  making

'సింహా' టైటిల్‌తో తెరకెక్కిన బాలయ్య సినిమాలు అన్నీ సూపర్‌ హిట్సే. 'సమరసింహారెడ్డి,' 'నరసింహ నాయుడు', 'లక్ష్మీ నరసింహ,' 'సింహా' ఇలా చాలా సినిమాలు బాలయ్య కెరీర్‌లో సింహా టైటిల్‌తో తెరకెక్కినవి ఉన్నాయి. తాజాగా బాలయ్య నటిస్తున్న 102వ చిత్రానికి ఇదే సెంటిమెంట్‌ని అప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య - కె.యస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'జై సింహా' టైటిల్‌ని ఫిక్స్‌ చేసినట్లు సమాచారమ్‌. ఈ టైటిల్‌ పట్ల అభిమానులు కూడా సుముఖంగా ఉన్నారు. నయనతార, నటాషా జోషి, హరిప్రియ ఈ సినిమాలో బాలయ్యతో జత డుతున్న ముద్దుగుమ్మలు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోంది

ఈ సినిమా. కాగా బాలయ్య - తేజ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ బయోపిక్‌ కూడా రెడీగా ఉంది. జనవరిలో ఈ సినిమా సెట్స్‌ మీదికి వెళ్లనుంది. ఈ సినిమాకి 'ఎన్టీఆర్‌' అనే టైటిల్‌ని అనుకుంటున్నారు. ఈ సినిమాతో బాలయ్య నిర్మాతగా మారుతుండడం విశేషం. ఎన్టీఆర్‌ నట జీవితం మొదలు, ఆయన రాజకీయంగా ఎదిగిన తీరు, ముఖ్యమంత్రిగా ఆయన సాధించిన అభివృద్ధి ఇలాంటి ముఖ్య అంశాలన్నీ ఈ సినిమాలో చూపించబోతున్నారు. కాగా పూరీతో ఈ మధ్యే 'పైసా వసూల్‌' సినిమా చేసిన బాలయ్య మరో సినిమా కూడా చేస్తాననీ ఆ సినిమా టైంలోనే పూరీకి మాటిచ్చారట. సో ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక బహుశా బాలయ్య మళ్లీ పూరీ సినిమాలో నటించే అవకాశాలున్నాయి. 100వ చిత్రం తర్వాత నుండీ బాలయ్య దూకుడుకు అస్సలు బ్రేకుల్లేవు. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాని సిద్ధం చేసి ఉంచుతున్నారు. ప్రస్తుతం 'జై సింహా' మేకింగ్‌లో ఉండగానే, 'ఎన్టీఆర్‌' బయోపిక్‌కి స్క్రిప్టు సిద్దం చేయిస్తున్నారు బాలయ్య.

మరిన్ని సినిమా కబుర్లు
ntr biopics