త్రివిక్రమ్ సినిమాలన్నీ చాలా సరదా సరదాగా ఉంటాయి. ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కే ప్రాధాన్యత ఇస్తుంటాడు త్రివిక్రమ్. అలాగే సినిమా ఓపెనింగ్స్ కూడా అంతే సరదాగా జరుగుతాయి. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా ఓపెనింగ్ కూడా అలాగే జరిగింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎన్టీఆర్ సినిమా ఇది. ఈ సోమవారం ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది. పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఎన్టీఆర్ సినిమాకి పవన్ క్లాప్‌నిచ్చారు. చాలా సరదాగా ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది.
స్టార్టింగ్ నుండీ ఎండింగ్ దాకా పవన్ కళ్యాణ్ సరదా సరదాగా కనిపించారు ఈ ఓపెనింగ్ డే రోజు. ఎన్టీఆర్, పవన్‌ని రిసీవ్ చేసుకోవడం దగ్గర్నుంచీ, వెళ్లే దాకా చాలా ముచ్చటగా సాగింది. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కులాసాగా కబుర్లు చెప్పుకోవడం, జోకులేసుకోవడం, నవ్వుకోవడం చూసిన ఇద్దరు హీరోల అభిమానులకీ పండగలా అనిపించింది. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదే బ్యానర్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఇది. నిర్మాణం పూర్తి కావచ్చింది. అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకీ, ఆ సినిమాకీ సంగీతం యంగ్ డైరెక్టర్ అనిరుధ్ అందించడం గమనార్హం. పవన్‌తో సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ సినిమా సెట్స్ మీదికెళ్లనుంది. అన్నట్లు ఈ సినిమాతో తారక్ తనయుడు అభయ్‌రామ్ ఎంట్రీ ఇస్తున్నాడంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.
|