Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

సూపర్‌ స్టార్‌ కృష్ణగారమ్మాయి 'మనసుకు నచ్చింది

manasuku nacchindi movie directed by  manjula

సూపర్‌ స్టార్‌ కృష్ణ తనయ మహేష్‌ సోదరి అయిన మంజుల నటిగా పలు చిత్రాల్లో నటించింది. 'కావ్యాస్‌ డైరీ', 'ఆరెంజ్‌' తదితర చిత్రాల్లో ఈమె నటించింది. నిర్మాతగా తమ్ముడు మహేష్‌తో 'నాని', 'పోకిరి' చిత్రాలను, నాగ చైతన్యతో ఏ మాయ చేశావె' చిత్రం, ఇతరత్రా కొన్ని చిత్రాలను రూపొందించింది. ఇవేమీ ఆమెకు సంతృప్తినివ్వలేదట. ఈ రోజు మంజుల పుట్టినరోజు. తన పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్‌ వీడియోని మంజుల సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అందులో మంజుల తన గురించి చెప్పుకుంది. 'మనసుకు నచ్చింది' అనే టైటిల్‌తో మంజుల ఓ షార్ట్‌ ఫిలింగా ఈ వీడియోని విడుదల చేసింది. ఇది తన సొంత జీవితానికి సంబంధించిన షార్ట్‌ ఫిలిం అనుకోవచ్చు. ఇందులో తన గురించి చాలా ఇంట్రెస్టింగ్‌ విషయాలను చెప్పింది మంజుల. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మంజుల పోస్ట్‌ చేసిన వీడియోకి మంచి స్పందన వస్తోంది. ఈ వీడియోని తిలకించి, మంజుల చేసిన ఈ ప్రయత్నం మ్యాజిక్‌ చేయబోతోందని ఆశిస్తున్నాననీ దర్శకుడు రాఘవేంద్రరావు చెప్పారు. మనసుకు నచ్చింది చేయడం ఎంత ముఖ్యమైనదో, నేను అర్ధం చేసుకోలేకపోయాను. ఆ ఆలోచన అందరిలోనూ కలగచేసినందుకు థాంక్స్‌ అంటూ ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్పందించింది. 'నా ప్రియమైన సోదరికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. చక్కటి ఇనీషియేటివ్‌' అంటూ మహేష్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ఇలా ఇంకా పలువురు సినీ ప్రముఖులు మంజులకి శుభాకాంక్షలు అందజేశారు. నటిగా నిర్మాతగా తన టాలెంట్‌ చూపించిన మంజుల దర్శకురాలిగా మారి, తాజాగా ఓ చిత్రం తెరకెక్కిస్తోంది. సందీప్‌ కిషన్‌, అమైరా దస్తూర్‌ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ సినిమాలో. 

మరిన్ని సినిమా కబుర్లు
bhagamati first look released