Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
bhagamati first look released

ఈ సంచికలో >> సినిమా >>

రాజశేఖర్‌ ఆనందానికి ఆకాశమే హద్దు

rajashekar garudavega super hit

'గరుడవేగ' సినిమాతో ఇటీవల మంచి హిట్‌ అందుకున్నారు రాజశేఖర్‌. ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. కెరీర్‌లో ఎన్నో సూపర్‌ హిట్స్‌ అందుకున్నాడు రాజశేఖర్‌. హిట్స్‌, ఫ్లాపులు ఆయనకి కొత్తేమీ కావు. కానీ ఇప్పుడు ఒక్క సినిమాతో హిట్‌ అందుకున్న రాజశేఖర్‌ మునుపెన్నడూ లేని ప్రత్యేకమైన ఆనందానుభూతులకు లోనవుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. అసలింక సినిమాలే మానేద్దాం అనుకున్న టైంలో వచ్చిన సూపర్‌ హిట్‌ ఇది. అదే ఆయన అమితానందానికి కారణం సినిమా హిట్‌ అవడానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నారు రాజశేఖర్‌. ఈ సినిమా ట్రైలర్‌ లాంఛింగ్‌ బాలయ్య చేతుల మీదుగా జరిగిన సంగతి తెలిసిందే. అందుకు ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు రాజశేఖర్‌. మెగాస్టార్‌ చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు రాజశేఖర్‌ - జీవిత దంపతులు.

సినిమా ఇంత విజయం సాధించడానికి చిరంజీవి సహాయ సహాకారాలు అంతా ఇంతా కావంటూ రాజశేఖర్‌ దంపతులు చెమర్చిన కళ్లతో భావోద్వేగానికి లోనయ్యారు. చిరంజీవి నుండి లభించిన మోరల్‌ సపోర్ట్‌ అమోఘం అని అన్నారు. అందరూ రాజశేఖర్‌ని మర్చిపోయిన టైంలో 'గరుడవేగ' సినిమాతో మంచి విజయం దక్కినందుకు రాజశేఖర్‌ ఆనందానికి ఆకాశమే హద్దయ్యింది. కాగా ఈ సినిమాలో రాజశేఖర్‌ ఎన్‌ఐఏ అధికారి పాత్రలో నటించారు. విజువల్‌గా ఈ సినిమా హాలీవుడ్‌ స్థాయిని తలపించేలా ఉంది. దేశరక్షణలో ఎన్‌ఐఏ అధికారులు తమ జీవితాన్ని ఎలా పణంగా పెట్టి జీవిస్తారో తెలియచెప్పే కథే 'పీఎస్‌వీ గరుడవేగ'. అన్ని వర్గాల వారినీ విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ చిత్రం. రాజశేఖర్‌ మునుపటి కన్నా హ్యాండ్‌సమ్‌ లుక్స్‌తో కనిపించారు. అన్నట్లు ఈ సినిమా మంచి విజయం సాధించడంతో శాటిలైట్‌ రైట్స్‌ని భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తాజా సమాచారమ్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
Anasuyaa is his inspiration says Rushmi