Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
manasuku nacchindi movie directed by  manjula

ఈ సంచికలో >> సినిమా >>

'భాగమతి' పోగొట్టింది అందరి మతి

bhagamati first look released

స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'భాగమతి'. అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. ఫస్ట్‌లుక్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా రిలీజ్‌ చేశారు. స్టిల్‌లో కొత్తదనం అన్నీ పక్కన పెట్టేస్తే, అనుష్క అలా కనిపించేసరికి 'వావ్‌! అనుష్క.. అనకుండా ఉండలేకపోయారు ఎవ్వరూ. బ్లాక్‌ డ్రస్సులో ఓ చేతికి మేకు వేసినట్లుగా, మరో చేతిలో రక్తం కారుతూ ఉన్న సుత్తితో కనిపిస్తోంది అనుష్క. శిలువ వేసినట్లుగా చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది ఈ లుక్‌. 'పిల్లజమీందార్‌' ఫేం అశోక్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్నో సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను రూపొందించిన యువీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది.

కాగా ఈ సినిమా స్టోరీని డైరెక్టర్‌ అశోక్‌ చాలా కాలం క్రితమే అనుష్కకి చెప్పారట. అయితే ఆ టైంలో అనుష్క చాలా బిజీగా ఉండడంతో, డైరెక్టర్‌ వెయిట్‌ చేయాల్సి వచ్చిందట. అనుష్క కోసం పుట్టిన స్టోరీ ఇది. అందుకే అనుష్క కోసం ఇంతకాలం వేచి చూడాల్సి వచ్చిందని డైరెక్టర్‌ అశోక్‌ తెలిపారు. అంతేకాదు మధ్యలో అనుష్క 'సైజ్‌జీరో' సినిమా కోసం బాగా లావెక్కాల్సి వచ్చింది. అదో కారణం ఈ సినిమాని అప్పుడు పట్టాలెక్కించకపోవడానికి. అలాగే 'బాహబలి' చిత్రంతో బిజీగా ఉండడం మరో కారణం. నిజానికి ఈ సినిమా స్టోరీ అనుష్కకి 'బాహుబలి'కి ముందే చెప్పారట. అప్పటి నుండి ఇప్పటివరకూ అనుష్క కోసమే వేచి చూడడం వెనక ఆమె డెడికేషనే కారణమంటున్నారు డైరెక్టర్‌. మొత్తానికి ఇన్నాళ్లకి సెట్స్‌ మీదికి వెళ్లింది 'భాగమతి'. అన్నట్లు ఈ సినిమాలో అనుష్కది ద్విపాత్రాభినయం అంటూ ప్రచారం జరుగుతోంది. అందులో వాస్తవం లేదనీ డైరెక్టర్‌ అన్నారు. ఉన్ని ముకుందన్‌, ఆది పినిశెట్టి, జయరాం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు 'భాగమతి'లో. 

మరిన్ని సినిమా కబుర్లు
rajashekar garudavega super hit