'బాహుబలి' చిత్రం తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రబాస్ నటిస్తున్న చిత్రం 'సాహో'. 'బాహుబలి' నిర్మాణ దశలో ఉన్నప్పుడే ప్రబాస్ ఈ సినిమాకి కమిట్ అయ్యాడు. అయితే 'బాహుబలి' విడుదలయ్యాక ఆ సినిమాకి వచ్చిన క్రేజ్‌తో ఈ సినిమా స్టాండర్ట్ మారిపోయింది. మొదట్లో చిన్న బడ్జెట్ సినిమాగా అనుకున్న 'సాహో', లెక్కలు 'బాహుబలి'తో ప్రబాస్‌కి వచ్చిన స్టార్‌డమ్‌తో పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. హీరోయిన్‌ని బాలీవుడ్ నుండి తీసుకురావడంతో అంచనాలు పెరిగిపోయాయి. అలా ఈ సినిమా 'బాహుబలి'లా భారీ బడ్జెట్ రేంజ్ మూవీ అయ్యి కూర్చుంది. ఇదంతా సరే, అసలు 'సాహో' సినిమా అప్‌డేట్స్ ఏంటి? షూటింగ్ ఎంతవరకూ వచ్చింది అనే విషయాలేమీ బయటికి రావడం లేదు. అప్పుడప్పుడూ హీరోయిన్ సోనమ్ కపూర్ సోషల్ మీడియా ద్వారా సరదా సరదాగా వెల్లడిస్తున్న అప్‌డేట్స్ తప్ప చిత్ర యూనిట్ నుండి కానీ, హీరో ప్రబాస్ నుండి కానీ వస్తున్న అప్‌డేట్స్ ఏమీ లేవు.
అయితే షూటింగ్ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయనే విషయం మాత్రం తెలియ వస్తోంది. గ్యాప్స్ తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నారట. దాంతో ఆలస్యమవుతోందనీ సమాచారమ్. యాక్షన్ ప్రధానాంశంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. చాలా ఆలోచించి, హీరోయిన్‌గా ఈ సినిమాకి సోనమ్ కపూర్‌ని ఎంచుకున్నారు. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 'బాహుబలి' కోసం పెంచిన కండల్ని కరిగించేసి, మునపటిలా అమ్మాయిలు మెచ్చే హ్యాండ్‌సమ్ లుక్‌లోకి మారిపోయాడు ఈ సినిమా కోసం హీరో ప్రబాస్. ఏది ఏమైనా 'సాహో' వివరాలను తెలుసుకోవాలనే కుతూహలంలో ప్రబాస్ ఫ్యాన్స్ ఉన్నారనీ తెలుస్తోంది.
|