సుకుమార్ - చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా 'రంగస్థలం'. విడుదల డేట్ దగ్గర పడేకొలదీ ఈ సినిమా విశేషాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది తాజాగా విడుదలైన ఆడియో సాంగ్ 'ఎంత సక్కగున్నావే..' దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌లో వచ్చిన ఈ సాంగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. 1985 కాలం నాటి ఓ పల్లెటూరి ప్రేమకథా చిత్రంగా 'రంగస్థలం' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ టైంలోని లవ్ స్టోరీని సుకుమార్ 'రంగస్థలం' సినిమాలో చూపించిన తీరుని ఒక్క సాంగ్‌తో చెప్పేశాడంతే. మొన్నీ మధ్యనే విడుదలైన హీరో, హీరోయిన్స్ ఫస్ట్‌లుక్ టీజర్స్‌తోనే సుకుమార్ అంటే 'ఇది' అనిపించుకున్నాడు. ఇప్పుడు లేటెస్టుగా విడుదలైన 'ఎంత సక్కగున్నావే..' సాంగ్‌తో సుకుమార్ అప్పుడే సగం మార్కులు కొట్టేశాడనిపిస్తోంది.
చిట్టిబాబు పాత్రలో ఒదిగిపోయిన చరణ్, రామలక్ష్మిగా సమంతని వర్ణిస్తున్న తీరుకు మాటలు చాలడం లేదు. అన్ని మాటల్నీ ఆ పాటలోనే వినిపించేశారు మరి. ఇకపోతే ఈ పాట సృష్టిస్తున్న రికార్డులు అన్నీ ఇన్నీ కావు. దేవిశ్రీ ప్రసాద్ గాత్రంతో, వినసొంపైన మ్యూజిక్‌తో సెన్సేషన్ సృష్టిస్తోంది 'ఎంత సక్కగున్నావే'. సమంత - చరణ్ తొలిసారి జత కట్టిన చిత్రమిది. పూజా హెగ్దే ఓ స్పెషల్ సాంగ్‌లో నటించింది. ఆ స్పెషల్ సాంగ్ సినిమాకి ఎక్స్‌ట్రా హైప్‌ని తెచ్చిపెట్టనుందని చిత్ర యూనిట్ ద్వారా అందిన సమాచారమ్. సుక్కు సినిమాల్లోని ఐటెం సాంగ్స్ అన్నీ ఒక ఎత్తు. ఈ సాంగ్ ఒక్కటీ ఒక ఎత్తు అనే రేంజ్‌లో ఈ సాంగ్ ఉండబోతోందట. అంతేకాదు ఈ సాంగ్‌లో నటించినందుకు పూజా హెగ్దేకి అత్యధిక మొత్తంలో రెమ్యునరేషన్ చెల్లించారనీ కూడా తెలుస్తోంది. బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్, యంగ్ హీరో ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|