Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
rangasthalam record start

ఈ సంచికలో >> సినిమా >>

కన్ను గీటి..ముద్దుల తుపాకి ఎక్కుపెట్టి..!

malayala kutti love expressing story

కళ్లతో ఎన్నో హావభావాలు పలికించొచ్చునన్న సంగతి ఇప్పటిది కాదు. అయితే ఇప్పుడు ఆ కళ్లు చెప్పే భాషని అంతగా పట్టించుకోవడం లేదు. కానీ పాత కాలం నాటి మన హీరో, హీరోయిన్లు కళ్లతోనే ఎన్నో భావాలు పలికించేవారు. అందుకే అందమైన అమ్మాయి కళ్లు ఎందరో కవులకు మెయిన్‌ ప్రాపర్టీస్‌ అయ్యాయి అప్పట్లో. ఇప్పుడు ఈ కళ్ల భాష గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తోందంటే, తాజాగా ఓ కలువ కళ్ల చిన్నది.. చూశారా 'కళ్లు' అనగానే కవిత్వం అలాగే పుట్టుకొచ్చేస్తుంది మరి. సరే ఈ సంగతి పక్కన పెడితే, ఓ కలువ కళ్ల చిన్నది సోషల్‌ మీడియాలో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇంతకీ ఆ చిన్నది ఎవరంటే, ఓ మలయాళ సినిమాలో హీరోయిన్‌. 'ఒరు అదర్‌ లవ్‌' సినిమా అది. ఆ సినిమా టీజర్‌ గురించే ఈ చర్చ అంతా.

ఒక్క సాంగ్‌ టీజర్‌, ఒక్క రోజులో ఎన్నెన్ని సెన్సేషన్స్‌ సృష్టించేసిందో తెలుసా? మలయాళ సినిమా అయినా కానీ ఈ బ్యూటీ తన ఎక్స్‌ప్రెషన్స్‌తో మొత్తం అంతా చుట్టేస్తోంది. పేరు ప్రియా ప్రకాష్‌. కళ్లతోనే ప్రేమికుడికి గాలమేసేస్తోంది. మొన్నీ మధ్యన విడుదల చేసిన ఫస్ట్‌ సాంగ్‌ టీజర్‌లో కన్ను గీటి కుర్రోడ్ని ముగ్గులోకి లాగేసింది. ఆ కనుసైగలతో పాపం సినిమాలో హీరో కుర్రోడు గిలగిలా కొట్టేసుకోవడం సంగతేమో కానీ, చూసిన కుర్రోళ్ల మనసులు కూడా గల్లంతైపోయాయి. తాజాగా ఈ బ్యూటీ ఏం చేసిందంటే, 'ముద్దు' పెట్టింది. జస్ట్‌ ముద్దే. కానీ ముద్దు అంటే అలాంటి ఇలాంటి ముద్దు కాదది. గన్నులాంటి కన్నులున్న ఆ చిన్నది తన ముద్దును ఆ గన్నులోనే బంధించి, కుర్రాడిపై సంధించింది. ఇంకేముంది. ఆ గన్ను తూటాకి కుర్రాడి గుండె గల్లంతే. అంతేనా ఈ సీన్‌ అంతా చూస్తున్న కుర్రకారు గుండెలు కూడా బేజారెత్తిపోతున్నాయ్‌. అదీ సంగతి. ఇదంతా జస్ట్‌ ఓ ఫ్లైయింగ్‌ కిస్‌ సీన్‌ అన్నమాట. ఈ సీన్‌కి యావత్‌ యూత్‌ ప్రపంచమంతా, శాంతం అమ్మడుకి ఫిదా అయిపోతున్నారంతే. అదీ ఈ మలయాళ కుట్టీ లవ్‌ ఎక్స్‌ప్రెసింగ్‌ స్టోరీ అన్న మాట.

మరిన్ని సినిమా కబుర్లు
psychological love story