చిరంజీవి 151వ సినిమా 'సైరా నరసింహారెడ్డి' ఫస్ట్ షెడ్యూల్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. ఆ షెడ్యూల్‌కి సంబంధించిన ఔట్ పుట్ అంతా చాలా బాగా వచ్చిందని చిత్ర యూనిట్ గతంలోనే పేర్కొంది. ఇక ఇప్పుడు రెండో షెడ్యూల్ పట్టాలెక్కనుంది. ఈ నెల 23 నుండి 'సైరా' రెండో షెడ్యూల్ షురూ కానుందట. మొదటి షెడ్యూల్ చిన్నదే కానీ.. ఇది లాంగ్ షెడ్యూల్ అట. ఈ షెడ్యూల్‌లోనే బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, హీరోయిన్ నయనతార కూడా పాల్గొననున్నారట. ఈ షెడ్యూల్ కోసం చిరంజీవి కసరత్తులు చేసి సిద్ధంగా ఉన్నారట. అంతేకాదు ఈ షెడ్యూల్‌లో కొన్ని పోరాట ఘట్టాలను కూడా చిత్రీకరించే అవకాశాలున్నాయనీ, అందుకోసం స్పెషల్ టీమ్‌నీ, స్పెషల్ సెట్స్‌నీ రెడీ చేసి ఉంచిందట చిత్ర యూనిట్. మరో పక్క ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ సెట్ కాలేదు.
మొదట్లో అనుకున్న రెహమాన్ కొన్ని కారణాలతో ఈ సినిమా నుండి తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లోకి ఎవర్ని తీసుకురావాలో తెలియక చిత్ర యూనిట్ కొంత గందరగోళంలో పడిన సంగతి తెలిసిందే. అయితే ఆ గందరగోళానికి కూడా ఈ నెల్లోనే తెర పడనుందట. ఈ నెల 23 లోపే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనూ చిత్ర యూనిట్ ఓ క్లారిటీకి రానుందనీ తాజా సమాచారమ్. ఆ దిశగా ఇప్పటికే తమన్, కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ ఇలా పలువురు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్స్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. డాషింగ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి 150వ చిత్రాన్ని తెరకెక్కించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు. సుదీప్, విజయ్ సేతుపతి..ఇలా ఇతర భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
|