Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
malayala kutti love expressing story

ఈ సంచికలో >> సినిమా >>

సైకలాజికల్ లవ్ స్టోరీగా మసక్కలి

psychological love story
కొన్ని కథలు విని నమ్ముతాం.. కొన్ని కథలు చూసి నమ్ముతాం.. మరికొన్ని కథలు చూసినా నమ్మలేని విధంగా ఉంటాయి.. అలాంటిదే నా ఈ కథ అంటూ ఓ కుర్రాడి యాంగిల్ లో చెప్పబోతోన్న

సినిమా ‘మసక్కలి’. ఇప్పటి వరకూ చూడని విధంగా ఓ సైకలాజికల్ లవ్ ఎంటర్టైనర్ గా రాబోతోంది మసక్కలి. ప్రేమికుల రోజు సందర్భంగా దర్శకనిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, మధుర శ్రీధర్ చేతుల మీదుగా మసక్కలి ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ - ‘‘కొత్తగా వస్తున్న దర్శకులు మంచి కథలు తెస్తున్నారు. అలాగే ఈ ట్రైలర్ కూడా చాలా బావుంది. సరికొత్తగా అనిపిస్తోంది. ఇలాంటి మంచి కథలను ఆదరణ ఇంకా పెరగాలి. మసక్కలి దర్శకుడిలో మంచి ప్రతిభ ఉంది. అతను ట్రైలరే కాదు సినిమా కూడా అద్భుతంగా తీసి ఉంటాడని నమ్ముతున్నాను’’ అన్నారు. మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ - ‘‘ఈ ట్రైలర్ నాకు బాగా నచ్చింది. అందుకే పాటలను మా మధుర ఆడియో ద్వారా విడుదల చేయబోతున్నాను. ఎంటైర్ టీమ్ కు ఆల్ ది బెస్ట్’’ అని చెప్పారు. దర్శకుడు నబి యేనుగుబాల మాట్లాడుతూ - ‘‘నేను మీడియా రంగం నుంచి వచ్చినవాడినే. మసక్కలి సైకలాజికల్ గేమ్ గా ఉంటుంది. అందమైన ప్రేమకథగా ఉంటూనే సైకలాజికల్ గా ఓ కొత్త అనుభూతినిచ్చే కథనం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది సైకలాజికల్ ఎలిమెంట్స్ మిక్స్ అయిన ఓ న్యూఏజ్ లవ్ స్టోరీ. అందరకీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. అలాగే పాటలు కూడా చాలా బావున్నాయి. మా పాటలు విడుదల చేస్తోన్న శ్రీధర్ గారికి, అలాగే నన్ను ప్రోత్సహిస్తోన్నఅందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మసక్కలి ఖచ్చితంగా మీ అందరికీ కొత్త అనుభూతినిస్తుందనే గ్యారెంటీ నాది’’ అన్నారు. మేమొక కొత్త ప్రయత్నం చేశాం. ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాం. ఇలాంటి కథ ఇంతకు ముందు తెలుగులో చూడలేదు అని నిర్మాత సుమిత్ సింగ్ అన్నారు. డూ గూడ్ ఫాలో రైట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న మసక్కలిలో.. సాయి రోనక్, శ్రావ్య, శిరీషా వంకా, కాశీ విశ్వనాథ్, నవీన్, రవివర్మ, రామ్ జగన్, దేవదాస్ కనకాల, నరసింహరాజు, చమ్మక్ చంద్ర తదితరులు నటిస్తున్నారు. సాంకేతిక నిపుణులు.. సంగీతం : మిహిరామ్స్, డి.వో.పి : సుభాష్ దొంతి, ఎడిటర్ : శివ శర్వాణి, పాటలు : అలరాజు, ఆర్ట్స్ : హరివర్మ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ :అరుణ్ చిలువేరు, పిఆర్వో : జి.ఎస్.కే మీడియా, నిర్మాత : సుమిత్ సింగ్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్వకత్వం : నబి యెనుగుబాల(మల్యాల).
మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam